Shah Rukh Khan: అరుదైన రికార్డు షారూక్ వశమవుతుందా..? అదే జరిగితే కొత్త చరిత్రే..!

రిపబ్లిక్‌డే నాడు పఠాన్‌తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేశాడు. కృష్ణాష్టమినాడు వచ్చిన 'జవాన్‌' రూ.700 కోట్లు దాటి, పఠాన్‌ను బ్రేక్‌ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇక క్రిస్మస్‌కు డిసెంబర్‌ 22న డంకీ మూవీతో వస్తున్నాడు షారూక్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 07:21 PMLast Updated on: Sep 18, 2023 | 7:21 PM

Shah Rukh Khan Will Create History If He Will Release Dunky In December

Shah Rukh Khan: షారూక్‌ కోసం అరుదైన రికార్డ్‌ ఎదురుచూస్తోంది. ఇంతవరకు ఎవరికీ సాధ్యంకానిది బాద్షా సొంతమైతే, ఇప్పట్లో ఈ రికార్డ్‌ బ్రేక్‌ చేయడం ఎవరివల్లా కాదంటున్నారు. స్టార్‌ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటైనా వస్తుందో రాదో తెలీదు. అలాంటిది ఈ ఏడాది బాద్షా మూడు సినిమాలతో వస్తున్నాడు. రిపబ్లిక్‌డే నాడు పఠాన్‌తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేశాడు. కృష్ణాష్టమినాడు వచ్చిన ‘జవాన్‌’ రూ.700 కోట్లు దాటి, పఠాన్‌ను బ్రేక్‌ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇక క్రిస్మస్‌కు డిసెంబర్‌ 22న డంకీ మూవీతో వస్తున్నాడు షారూక్‌.

ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న షారూక్‌ వస్తున్నాడంటే.. డంకీపై అంచనాలు భారీగా వుంటాయి. అందులోనూ మున్నాభాయ్‌ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్‌, పీకే వంటి అద్భుతమైన సినిమాలు తీసిన రాజ్‌కుమార్‌ హిరాణి డైరెక్టర్‌ కావడంతో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తాడన్న నమ్మకం వుంది. డంకీ కూడా రూ.వెయ్యి కోట్లు దాటితే.. ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్లు వున్న హీరోగా ఎవరికీ అందనంత ఎత్తులో వుండిపోతాడు షారూక్‌. ఇప్పటి స్టార్స్‌ ఒకే ఏడాది మూడు సినిమాలతో రావడం కష్టమే. డంకీ క్రిస్మస్‌కు వస్తుందా..? రాదా..? అన్న కన్‌ఫ్యూజన్‌కు షారూక్‌ చెక్‌ పెట్టాడు. జవాన్‌ సెలబ్రేషన్స్‌లో మాట్లాడుతూ.. క్రిస్మస్‌కు వస్తుందని చెప్పడంతో.. ఫ్యాన్స్‌ రికార్డులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక జవాన్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ముంబాయ్‌లో ఘనంగా జరిగాయి. ప్రతి ఈవెంట్‌లో షారూక్‌కు ముద్దు పెట్టే సీన్‌ను దీపిక కొనసాగించింది. షారూక్‌.. అనిరుధ్‌కు ముద్దు పెట్టి హగ్‌ చేసుకుంటే.. దీపిక షారూక్‌ను ముద్దాడింది. సినిమాలోని పాటను అనిరుధ్‌ పాడగా.. దీపిక, షారూక్‌ కలిసి డ్యాన్స్‌ చేశారు.

జవాన్‌ బ్లాక్‌బస్టర్‌ అయినా.. పాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చినా.. నయనతార మాత్రం గీత దాటలేదు. సినిమా ఓకె చేశామా.. ఫినిష్‌ చేశామా.. తప్ప మరో ధ్యాస వుండదు. జవాన్‌ విషయంలో ఇదే పద్దతిని ఫాలో అయింది. తమిళనాడులో జరిగిన ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో, ముంబాయిలో జరిగిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో కనిపించలేదు నయనతార. జవాన్‌లో మరో హీరోయిన్‌ వుంటే.. బ్లాక్‌బస్టర్‌ తర్వాత ప్రమోషన్‌లో కనిపిస్తూ క్రేజ్‌ను మరింత పెంచుకునేది. కానీ నయన మాత్రం రిలీజ్‌‌కు ముందు.. తర్వాత కూడా జవాన్‌ను పట్టించుకోలేదు. అయితే, జవాన్‌లో దీపికది చిన్న రోలే అయినా రిలీజ్‌ తర్వాత ఈవెంట్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తోంది. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ మీట్‌లో పాల్గొంది. స్టేజ్‌ మీద డ్యాన్స్‌ చేసింది. ఓం శాంతి ఓం, చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌, పఠాన్‌.. లేటెస్ట్‌గా జవాన్‌తో షారూక్‌, దీపిక హిట్‌ పెయిర్‌ ఇమేజ్‌ను రెట్టింపు చేసుకున్నారు.