Dunki Teaser: డంకీ టీజ‌ర్ విడుదల.. 1000 కోట్లపై షారుక్ కన్ను..

రీసెంట్‌గా జవాన్‌తో భారీ విజయం అందుకున్న షారుఖ్‌ ఖాన్‌.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో వస్తున్నాడు. రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో డంకీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2023 | 04:24 PMLast Updated on: Nov 03, 2023 | 6:48 PM

Shah Rukh Khans Dunki Teaser Released Movie Will Cross 1000 Crores

Dunki Teaser: షారూఖ్ బర్త్ డే సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదరుచూసిన డంకీ స్పెషల్ వీడియో గురువారం ఉదయం రిలీజైపోయింది. అలా వచ్చిందో లేదో.. డంకీ.. సోషల్ మీడియా డంకా బజాయిస్తోంది. కమ్ బ్యాక్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో యమ జోరుమీదున్నాడు కింగ్ ఖాన్. రీసెంట్‌గా జవాన్‌తో భారీ విజయం అందుకున్న షారుఖ్‌ ఖాన్‌.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో వస్తున్నాడు. రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో డంకీ సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షారుఖ్‌ పుట్టినరోజు సందర్భంగా తాజాగా డంకీ టీజర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటోంది. టీజర్‌ను బట్టి.. విదేశాలకు వెళ్లాలనే నలుగురు స్నేహితుల కల చుట్టూ ‘డంకీ’ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఆ నలుగురికి ఎదురయ్యే సవాళ్లు ఇందులో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేమ, స్నేహబంధాల గొప్పదనం చాటి చెప్పేలా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చాడు రాజ్ కుమార్ హిరాణీ. తన మార్క్‌ను చూపిస్తూ ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించాడు. టీజర్‌లో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ వంటి వారి పాత్రలను పరిచయం చేశారు.

అన్ని పాత్రలకు ప్రాముఖ్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో మొదటిసారిగా సినిమా వస్తుండటంలో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. డంకీ కూడా షారుఖ్ కెరీర్లో రూ.1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో.