Jawan: అట్లీ జవాన్ ఆస్కార్ ఆశల మీద కామెంట్ల దాడి..?
ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ అప్పట్లో రూ.1200 కోట్లు రాబట్టింది. జవాన్ జోరు చూస్తుంటే, ఇది కూడా రూ.1000 కోట్ల నుంచి రూ.1200 కోట్లు రాబట్టేలా ఉంది. అలా వసూళ్ల పరంగా త్రిబుల్ ఆర్‌ని రీచ్ అయ్యే మూవీ తీశానని అట్లీ తనని తాను రాజమౌళితో పోల్చుకుంటున్నాడేమో.
Jawan: ‘షారుఖ్‌తో అట్లీ తీసిన జవాన్ మూవీ ఆస్కార్ రేసులో ఉందా..? అయితే సంపూర్ణేష్ బాబు చేసిన హృదయ కాలేయం కూడా లిస్ట్‌లో పెట్టండి’.. ఇదీ తాజాగా సోషల్ మీడియాలో కనిపించిన మీమ్. ఇలా చూస్తే హిందీ, తమిళ్.. ఇలా అన్ని భాషల్లో జవాన్ ఆస్కార్ రేసు మీద జోకులు పేలుుతున్నాయి. ఏదో అట్లీ హిందీ సినిమా తీసి అక్కడ వెయ్యకోట్ల వసూళ్ల హిట్ పట్టాడనుకుంటే, ఇప్పుడు ఆస్కార్ మోజులో పడి, వచ్చిన కాస్త పేరుని చెడకొట్టుకుంటున్నాడా అన్న అనుమానాలు పెరిగాయి.
ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ అప్పట్లో రూ.1200 కోట్లు రాబట్టింది. జవాన్ జోరు చూస్తుంటే, ఇది కూడా రూ.1000 కోట్ల నుంచి రూ.1200 కోట్లు రాబట్టేలా ఉంది. అలా వసూళ్ల పరంగా త్రిబుల్ ఆర్‌ని రీచ్ అయ్యే మూవీ తీశానని అట్లీ తనని తాను రాజమౌళితో పోల్చుకుంటున్నాడేమో. కానీ, త్రిబుల్ ఆర్‌కి, జవాన్‌కి నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉంది. త్రిబుల్ ఆర్ కూడా కమర్శియల్ మూవీనే, కానీ, అమెరికా, యూరప్.. ఇలా ప్రపంచం మొత్తం ఈ సినిమాలో సీన్లకు, సాంగ్స్‌లో డాన్స్‌కి ఫిదా అయ్యింది. హాలీవుడ్ స్టార్స్ అయితే ట్వీట్లు పెట్టి పిచ్చెక్కించారు. దాని ఫలితమే, నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కింది. ఇన్ని జరిగాయి కాబట్టి త్రిబుల్ ఆర్ ఆస్కార్ రేసుకో అర్ధం ఉంది.
కాని జవాన్‌లో ఏముందని..? యూఎస్, యూరప్ జనాల్లో ఏమంత ఫోకస్ అయ్యిందని.. దీని మీద ఆస్కార్ ఆశలు పెట్టుకుంటున్నాడు అట్లీ. అందుకే అట్లీ అతితెలివిని ట్రోలింగ్‌తో మెచ్చుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఆస్కార్ మీద ఆశలు పెట్టుకోవచ్చుకాని, ఒక రొటీన్ ఫార్ములా మూవీని తీసి ఆస్కార్ మీద హోప్స్ పెట్టుకోవటమే తప్పని కామెంట్లకు కారణమౌతోంది.