Vijay Devarakonda: విజయ్ లేకపోతే తాను లేనని తేల్చేసిన బాలీవుడ్ స్టార్
కబీర్ సింగ్ హిట్ తర్వాత రౌడీ స్టార్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేదు. దీంతో అప్పట్లో కామెంట్లు కూడా పేలాయి. కట్ చేస్తే ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేకపోతే తాను లేననేంత స్టేట్‌మెంట్ ఇచ్చే వరకు సీన్ మారింది.

Vijay Devarakonda: రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీని హిందీలో కూడా ప్రమోట్ చేస్తూ బిజీ అయ్యాడు. ఈలోపు సడన్‌గా ఈ హీరోలోని అర్జున్ రెడ్డి మీద మనసు పారేసుకున్నాడు హిందీ హీరో షాహిద్ కపూర్. గతంలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చేస్తున్నప్పుడు అర్జున్ రెడ్డిగా విజయ్ పెర్పామెన్స్ మెచ్చుకున్న షాహిద్.. కబీర్ సింగ్ హిట్ తర్వాత రౌడీ స్టార్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేదు. దీంతో అప్పట్లో కామెంట్లు కూడా పేలాయి.
Arundhati Nair: చావుబతుకుల మధ్య హీరోయిన్.. చికిత్సకు డబ్బుల్లేక దారుణ స్థితిలో
కట్ చేస్తే ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేకపోతే తాను లేననేంత స్టేట్‌మెంట్ ఇచ్చే వరకు సీన్ మారింది. అర్జున్ రెడ్డిని తీసింది సందీప్ రెడ్డి వంగా అయినా, ఆ పాత్రలోదూరి ఆ పాత్రకు ప్రాణం పోసింది విజయ్ దేవరకొండ. అసలు రౌడీ స్టార్ ఆ మూవీ చేయకపోతే ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే సినిమానే ఉండేది కాదు. అదే లేకపోతే దాని రీమేక్ కబీర్ సింగ్ వచ్చేదే కాదు. విజయ్ రేంజ్ ఏంటో, తన పెర్ఫామెన్స్ లెవల్ ఏంటో పొరుగింటి స్టార్‌కి కూడా అర్ధమయ్యేలా చేసింది అర్జున్ రెడ్డి. దటీజ్ రౌడీ స్టార్. నిజమే.. అర్జున్ రెడ్డి కథ, కథనం, మేకింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగ చరిత్ర సృష్టించాడు.
కాకపోతే తను అనామకుడిగా ఉన్నప్పుడు మరో అనామకుడైన విజయ్ అంత బాగా నటించకపోతే, అర్జున్ రెడ్డి అనే కలాఖండం అంత గొప్పగా వచ్చేది కాదు. అందుకే.. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్‌కి హిట్లొచ్చినా, ప్లాపులు పడ్డా, తనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే.. దానికి కారణం.. అర్జున్ రెడ్డిగా విజయ్ జనాల్లోకి అంతగా దూసుకెళ్లటమే.