Shankar: ఒకే ఫ్రేమ్‌లో అన్నదమ్ములు.. సూర్య, కార్తిలతో శంకర్ మల్టీస్టారర్ మూవీ

ఇటు సూర్య .. అటు కార్తి ఇమేజ్‌కి తగినట్టుగా ఆ పాత్రలను డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. హీరో సూర్య, కార్తీ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉండటం సహాజం. అలాగే భారీ అంచనాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఇద్దరికీ స్టార్‌డమ్ కూడా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2023 | 12:03 PMLast Updated on: Nov 15, 2023 | 12:03 PM

Shankar Is Plannina A Movie With Suriya And Karthi As Multistarrer

Shankar: తమిళ హీరోలు సూర్య, కార్తీ ఇద్దరు అన్నదమ్ములు. ఇటు క్లాస్, అటు మాస్ రెండు రకాల సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. కేవలం కోలివుడ్‌లోనే కాదు.. ఇటు టాలీవుడ్‌లో కూడా వారిద్దరికీ మంచి మార్కెట్ ఉంది. యావరేజ్ తెలుగు హీరో సినిమా కన్నా ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టగలరు. అయితే వీరిద్దరు రకరకాల పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా లేదు. ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

Earthquake: పాకిస్తాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదు..

ఇదే విషయం వారికి చాలా ఇంటర్వ్యూలలో ఎదురయ్యాయి. సరైన కథ దొరికితే చేస్తామని చెబుతూ వచ్చారు. అయితే వీరిద్దరిని కలిపే ఒక కథను క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్ టీమ్ రెడీ చేస్తున్నట్టుగా కోలివుడ్ కోడై కూస్తోంది. ఇటు సూర్య .. అటు కార్తి ఇమేజ్‌కి తగినట్టుగా ఆ పాత్రలను డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. హీరో సూర్య, కార్తీ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉత్సాహం ఉండటం సహాజం. అలాగే భారీ అంచనాలు కూడా ఉంటాయి. వీటితో పాటు ఇద్దరికీ స్టార్‌డమ్ కూడా ఉంది. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఓ క్రేజీ స్టోరీని డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా చెబుతున్నారు.

ఇప్పటికే రోలెక్స్ లాంటి 5 నిమిషాల క్యామియో రోల్‌తో కేక పుట్టించిన సూర్య.. ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక జపాన్ మూవీ హిట్‌ను ఎంజయ్ చేస్తున్నారు హీరో కార్తీ. అలాగే డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ రెండు చిత్రాలు అయిపోయిన వెంటనే శంకర్ మల్టీస్టారర్ చిత్రాన్ని రెడీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే.. అన్నదమ్ములు కలిసి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.