లాభాల్లో వాటా…? పుష్పకు మేకర్స్ బిగ్ గిఫ్ట్
ఈ రోజుల్లో సినిమా హిట్ అంటే కమర్షియల్ గా హిట్ కొట్టడమే. కమర్షియల్ గా సినిమాను ప్రమోట్ చేయడానికి మేకర్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు. హీరోలు కూడా ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. గతంలో సినిమా వంద రోజులు ఆడితే హిట్...
ఈ రోజుల్లో సినిమా హిట్ అంటే కమర్షియల్ గా హిట్ కొట్టడమే. కమర్షియల్ గా సినిమాను ప్రమోట్ చేయడానికి మేకర్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు. హీరోలు కూడా ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. గతంలో సినిమా వంద రోజులు ఆడితే హిట్… ఇప్పుడు వెయ్యి కోట్లు వస్తే హిట్. వంద కోట్లు ధాటి, 500 కోట్లు క్రాస్ చేసి… వెయ్యి వరకు వెళ్ళింది లెక్క. కల్కీ సినిమాతో ఇండియన్ సినిమా కొత్త లెక్కలు చూసింది. ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాయి అప్ కమింగ్ మూవీస్ అన్నీ. పాన్ ఇండియా సినిమాల టార్గెట్ మొత్తం అదే.
ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సినిమాపై ఉన్న అంచనాలకు సినిమా మేకింగ్ ను చూస్తే వెయ్యి కోట్లు పక్కా అనే ధీమాతో ఆడియన్స్ కూడా ఉన్నారు. సినిమాను ఇప్పుడు మేకర్స్ ప్రమోట్ చేస్తున్న లెక్క చూస్తుంటే ఇండియా వైడ్ గా వసూళ్ళపై ఏ రేంజ్ లో ఫోకస్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. నార్త్ ఇండియాను మేకర్స్ ఎక్కువగా ఫోకస్ చేయడం చూస్తున్నాం. సౌత్ లో తమిళనాడు, కర్ణాటక, కేరళ విషయంలో… ఇప్పుడు అల్లు అర్జున్ ఫోకస్ చేసి ప్రమోట్ చేస్తున్నాడు. తెలుగు సినిమాలకు కన్నడలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
అందుకే బెంగళూరులో కూడా ఓ ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేసారు. చెన్నైలో ఈవెంట్ చేసి… కిస్సిక్ సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చేసింది. దీనితో తర్వాతి ఈవెంట్ పై ఫోకస్ పెట్టారు. ఇక్కడి వరకు ఓకే గాని ఇప్పుడు వినపడుతున్న ఓ న్యూస్ మాత్రం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అదేంటో చూద్దాం… పుష్ప సక్సెస్ లో బన్నీ పాత్ర ఎక్కువ. ముఖ్యంగా అల్లు స్నేహా రెడ్డి సినిమాను ప్రమోట్ చేసే విషయంలో కాస్త క్రేజీగా ఆలోచించారు. క్రికెటర్స్ తో ప్రమోట్ చేయించడంతో సినిమా లెక్క మారింది.
అందుకే ఇప్పుడు పుష్ప 2 పై వరల్డ్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. దీనితో… బన్నీకి మరో క్రేజీ గిఫ్ట్ ను ప్లాన్ చేసారు మేకర్స్. ముందు సినిమాకు రెమ్యునరేషన్ 300 కోట్లు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లాభాల్లో 5 శాతం వాటా కూడా ఇస్తున్నారు. ప్రమోషన్స్ లో బన్నీ కీ రోల్ ప్లే చేయడంతో మేకర్స్ కాస్త ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు. అదే జరిగితే బన్నీకి మరో 50 నుంచి 60 కోట్లు వచ్చే ఛాన్స్ ఉండవచ్చు అని లెక్కలు వేస్తున్నారు సినిమా జనాలు.