మూడు సూపర్ హిట్లు, వేల కోట్ల ఆస్తులతో స్టార్ హీరో…!
కింగ్ ఖాన్... షారుఖ్ ఖాన్... ఇండియాలోనే సూపర్ రిచ్ యాక్టర్. ఒకవైపు సినిమాలు, మరో వైపు వ్యాపారం, ఇంకో వైపు క్రికెట్ ఇలా అన్ని విధాలుగా ఈ సీనియర్ స్టార్ హీరో సంపాదన ఎవరికి అందని ఎత్తులో ఉంది.
కింగ్ ఖాన్… షారుఖ్ ఖాన్… ఇండియాలోనే సూపర్ రిచ్ యాక్టర్. ఒకవైపు సినిమాలు, మరో వైపు వ్యాపారం, ఇంకో వైపు క్రికెట్ ఇలా అన్ని విధాలుగా ఈ సీనియర్ స్టార్ హీరో సంపాదన ఎవరికి అందని ఎత్తులో ఉంది. ఏ స్టార్ హీరో కూడా షారూఖ్ ఆస్తులతో పోటీ పడే పరిస్థితిలో లేరు అనే చెప్పాలి. “పఠాన్, జవాన్, డుంకీ” వంటి సూపర్ హిట్ సినిమాలతో ఈ హీరో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థతో సినిమాలు నిర్మిస్తున్న షారూక్… తన సినిమాలలో తానే పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఈ బ్యానర్ లో షారూఖ్ నిర్మించాడు. ఈ సంస్థకు ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. మరో వైపు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా షారూక్ ఖాన్ పెట్టుబడులు పెట్టాడు. ఇక తాజా లెక్కల ప్రకారం అతని ఆస్తులు భారీగా పెరిగాయి. 2024లో, అతను భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు, ఒక్కో చిత్రానికి రూ. 150 నుండి 250 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. జవాన్ మరియు పఠాన్ సినిమాలకు లాభాల్లో వాటా కూడా తీసుకున్నాడు.
2024 హురున్ ఇండియా రిచ్ లిస్టులో సిల్వర్ స్క్రీన్ టైటాన్స్ విభాగంలో షారూఖ్ ఖాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతని నికర ఆస్తుల విలువ రూ.7,300 కోట్లుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో… జూహీ చావ్లా, ఆమె కుటుంబం 4,600 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ 2,000 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా షారూక్ ఖాన్ భారీగా లాభాలు అర్జిస్తున్నాడు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా సహా పలు ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఐపిఎల్ లో భారీ లాభాలను చూస్తున్నాడు షారూఖ్.