Sharwanand: శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా ?
సినీ స్టార్స్ జీవితాలు కనిపించేంద కలర్‌ఫుల్‌గా ఉండవు. నిజం చెప్పాలంటే వాళ్లకు అసలు ప్రైవసీ ఉండదు. వాళ్ల జీవితాల్లో ఏం జరిగినా అది వైరల్‌గానే మారిపోతుంది. అప్పుడప్పుడు నిజంలేని గాసిప్స్ కొన్ని వాళ్లను పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు శర్వానంద్ విషయంలో కూడా అదే జరిగింది.
గౌరి సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన శర్వానంద్ కొద్ది రోజుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. పెద్ద హీరోల పక్కన లీడ్ రోల్స్ చేస్తూ నెమ్మదిగా హీరో అయ్యాడు. పేరుకు 34 సినిమాలు చేసినా.. సరైన హిట్ లేక స్టార్ హీరో స్టేటస్ అందుకోలేకపోతున్నాడు. 5 నెలల క్రితం శర్వానంద్ రక్షిత అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ ఈవెంట్‌కు అతని ఫ్రెండ్స్ రామ్‌చరణ్, రాణా, హీరోలు అంతా వచ్చారు. శర్వానందర్ రక్షిత ఫొటోలు చూసి ఆయన ఫ్యాన్స్ చాలా సంతోషించారు.
త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఎంగేజ్‌మెంట్ ఐనదగ్గరి నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో శర్వానంద్ రక్షిత పెళ్లి క్యాన్సిల్ ఐందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. మొదట్లో సైలెంట్‌గానే ఉన్నా.. సీన్ సీరియస్ అవ్వడంతో శర్వానంద్ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం శర్వానంద్35 సినిమాలో బిజీగా ఉండటంతో పెళ్లి కాస్త లేట్ ఐందని క్లారిటీ ఇచ్చింది. ఈ గాసిప్స్‌కు బ్రేక్ వేసేందుకు పెళ్లి డేట్‌ను కూడా రివీల్ చేసింది. జూన్ 2న రాజస్థాన్ జైపూర్‌లోని ది లీలా పాలెస్‌లో శర్వానంద్ పెళ్లి జరగనున్నట్టు చెప్పింది. దీంతో శర్వానంద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. శర్వానంద్ పెళ్లి క్యాన్సిల్ అవ్వలేదని తెలియడంతో హ్యాపీగా ఫీలౌతున్నారు.