Nani : శేఖర్ కమ్ముల తో నాని
తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన డైరెక్షన్ లో 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్', 'లీడర్', 'ఫిదా' వంటి క్లాసిక్ సినిమాలు వచ్చాయి.

Shekhar Kammula is one director who has created a unique brand for himself.
తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన డైరెక్షన్ లో ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘ఫిదా’ వంటి క్లాసిక్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ధనుష్, నాగార్జున, రష్మికలతో ‘కుబేర’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత నానితో ఓ సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తీసే క్లాసిక్ సినిమాలకు నాని సరిగ్గా సరిపోతాడు. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే.. ప్రకటనతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.
నాని త్వరలో ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దీని తరువాత ‘హిట్-3’, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. అనంతరం నాని తన 34వ సినిమాని శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేయనున్నాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించనుందని సమాచారం.
శేఖర్ కమ్ముల వరుసగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. ఆయన గత చిత్రం ‘లవ్ స్టోరీ’ ఇదే బ్యానర్ లో రూపొందింది. షూటింగ్ దశలో ఉన్న ‘కుబేర’ను ఈ బ్యానరే నిర్మిస్తోంది. ఇప్పుడు మరో సినిమాకి సిద్ధమవుతోంది. నిజానికి శేఖర్ కమ్ములతో మూడో సినిమాని ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ప్రకటించింది. కానీ హీరో మరియు ఇతర వివరాలను రివీల్ చేయలేదు. అయితే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో కమ్ముల చేయనున్న మూడో సినిమాలో నానినే హీరో అని తాజాగా న్యూస్ చక్కర్లు కొడుతోంది.