Shine Tom Chacko: మళ్లీ పెళ్లి.. త్వరలో దసరా విలన్ పెళ్లి
వరుస సినిమాలతో బిజీగా ఉన్న చాకో 40 ఏళ్ళ వయస్సులో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. గత కొంత కాలంగా అతను మోడల్ తనూజ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఏ ఫంక్షన్‌కు వచ్చినా ఆమెతో కలిసి వస్తున్నాడు.

Shine Tom Chacko: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్‌లో మంచి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చాకో.. దసరా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నానికి ధీటుగా చాకో చూపిన నటన అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుతం చాకో దేవర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చాకో 40 ఏళ్ళ వయస్సులో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు.
Trivikram movie : త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్
గత కొంత కాలంగా అతను మోడల్ తనూజ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఏ ఫంక్షన్‌కు వచ్చినా ఆమెతో కలిసి వస్తున్నాడు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇక ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ తనూజతో తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చాకో అధికారికంగా ప్రకటించాడు. సోషల్ మీడియాలో నిశ్చితార్థం జరిగిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక చాకోకు ఆల్రెడీ గతంలో తబితా అనే అమ్మాయితో వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని విడిపోయారు. వీరు వీడిపోయే సమయానికి వీరికి ఒక పాప కూడా ఉందని సమాచారం. ఈ విషయంపై ఎక్కడా షైన్ టామ్ చాకో ప్రస్తావించలేదు. ఇప్పుడు ఒక మోడల్‌ను వివాహం చేసుకోబోతున్నారని తెలిసి అభిమానులు షైన్ టామ్ చాకోకు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.