SHIVAJI: అదే అడ్డొచ్చింది.. అమర్ దీప్‌ను కొడదామనుకున్నా..
ఇంటి నుంచి బయటకు వచ్చాక.. అమర్‌పై ఉన్న నెగిటివిటీ గురించి ప్రశ్నలు ఎదురుకాగానే.. అమర్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కవరింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన శివాజీ.. మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు.
SHIVAJI: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు.. ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఏ సీజన్‌కు రానంత హైప్ బిగ్ బాస్-7కు వచ్చింది. సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన రాద్దాంతం.. రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్-7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలువగా, రన్నరప్‌గా టీవీ నటుడు అమర్ దీప్ నిలిచాడు. అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో కొంత మంది అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చి రచ్చ చేయడం, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడం, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, యాంకర్ కార్ల అద్దాలు పగుల గొట్టడం చేశారు. అంతేనా.. ప్రశాంత్.. ప్రత్యర్ధిగా భావించే అమర్ దీప్ తల్లి, భార్య ఉన్న వాహనంపై కూడా దాడి చేసిన సంగతి విదితమే.
Prashanth Varma: పూనకాలు లోడింగ్.. బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ.. క్లారిటీ వచ్చేసింది..!
ఈ అల్లర్లకు పల్లవి ప్రశాంత్ కారణమని నిర్ధారించిన పోలీసులు.. అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో టాప్ -3లో నిలిచిన నటుడు శివాజీ. మాస్టర్ మైండ్ గేమ్ ఆడి.. అమర్ దీప్ బ్యాచ్ అయిన స్పాను టార్గెట్ చేస్తూ ఉండేవాడు. అతడిని ఐటెం రాజా అనడం కానీ.. పలుమార్లు వేస్ట్ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు అంటూ ఏ కంటెస్టెంట్ తిట్టనన్ని తిట్టు తిట్టేవాడు. ఇంటి నుంచి బయటకు వచ్చాక.. అమర్‌పై ఉన్న నెగిటివిటీ గురించి ప్రశ్నలు ఎదురుకాగానే.. అమర్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ కవరింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన శివాజీ.. మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. బిగ్ బాస్ జర్నీలో ఇబ్బంది పడిన సందర్భం ఏంటని ప్రశ్న రాగా.. ‘ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. 14వ వారంలో అమర్, ప్రశాంత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్భంలో అమర్‌ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయ్యి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచుకుంది.
గేమ్‌కు బౌండ్ అయి అగ్రిమెంట్‌లో సంతకం చేశాను కాబట్టి అమర్‌ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది’ అంటూ శివాజీ మాట్లాడారు. ఇది ఇలా ఉంటే.. శివాజీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్లు. బిగ్ బాస్ అనేది ఓ ఎమోషన్‌తో కూడుకున్న గేమ్ అంతే. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు గొడవలు జరుగుతుంటాయి. అవి అక్కడి వరకే పరిమితం. బయటకు వచ్చాక.. చక్కగా, ఫ్రెండ్లీగా కలిసిపోయి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ షో నుంచి బయటకు వచ్చాక.. ఇప్పుడు అమర్‌పై విమర్శలు చేయడం సబబు కాదంటూ పేర్కొంటున్నారు. అలాగే మీరు కూడా అమర్‌ను నోటికి ఇష్టమొచ్చినట్లు తిట్టలేదా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మళ్లీ రెచ్చగొట్టడమే అవుతుంది. ఇప్పటికే అమర్ కారుపై దాడి జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వింటే.. మళ్లీ అలాంటి పరిణామాలు జరగొచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడొద్దంటూ హితపు పలుకుతున్నారు.