Bigg Boss 7 Telugu : ఫస్ట్ లేడీ కెప్టెన్ గా శోభా.. గౌతమ్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు

బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ టాస్క్ నడించింది. హాల్ ఆఫ్ బాల్ అని కెప్టెన్సీ లో వీర సింహాలు,గర్జించే పులులు గట్టిగా పోటీ పడ్డారు. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టారు . శివాజీ , గౌతమ్ గొడవ పడ్డారు. శివాజీ టీం కు షాకుల మీద షాకులు తగిలితే.. గౌతమ్ టీం కు ఆఫర్ల మీద ఆఫర్లు బంపరాఫర్లు వచ్చాయి. గౌతమ్ టీం కు లభించిన గోల్డెన్ బాల్, బ్లాక్ బాల్ తో గేమ్ నే మార్చేసుకుని విజేతలుగా నిలవడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2023 | 10:36 AMLast Updated on: Nov 04, 2023 | 11:32 AM

Shobha As First Lady Captain In Bigg Boss Season 7

బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ టాస్క్ నడించింది. హాల్ ఆఫ్ బాల్ అని కెప్టెన్సీ లో వీర సింహాలు,గర్జించే పులులు గట్టిగా పోటీ పడ్డారు. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టారు . శివాజీ , గౌతమ్ గొడవ పడ్డారు. శివాజీ టీం కు షాకుల మీద షాకులు తగిలితే.. గౌతమ్ టీం కు ఆఫర్ల మీద ఆఫర్లు బంపరాఫర్లు వచ్చాయి. గౌతమ్ టీం కు లభించిన గోల్డెన్ బాల్, బ్లాక్ బాల్ తో గేమ్ నే మార్చేసుకుని విజేతలుగా నిలవడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.

Bigg Boss 7 : నాగార్జునకు షాక్ .. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా బాలకృష్ణ ?

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెండర్లతో కాకుండా.. వారి ఫ్లేస్ లో మరొకరితో ఆడించాడు. సంచాలకుడిగా ప్రశాంత్ ను నియమించిన బిగ్ బాస్ పోటీదారులకు ధర్మకోల్ బాల్స్ ఉన్న సంచిని ఇచ్చి రౌండ్ లో తిరగాలని సూచించాడు. దీంతో శివాజీ, బోలే,ప్రియాంక, అమర్, అశ్విని పోటీలో పాల్గొన్నారు. గేమ్ మధ్యలో ఫిజికల్ అవ్వడంతో ప్రశాంత్ గేమ్ ను ఆపేశాడు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఔట్ అయ్యారు. అమర్ గట్టి గట్టిగా ఆడుతూ.. గేమ్ హీటెక్కించాడు. ఫైనల్ గా ప్రియాంక, అమర్ పోటీ పడ్డారు. చివరకు అమర్ విన్నర్ గా నిలిచాడు. అయితే.. శోభా శెట్టి కోసం అమర్ ఆడి… మోనిత కెప్టెన్ ను చూశాడు. ఫస్ట్ లేడీ కెప్టెన్ గా శోభా నిలిచింది.

MEGASTAR CHIRANJEEVI: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్..

శోభా కెప్టెన్స్ అయిన తర్వాత ఇంట్లో చిన్నపాటి డిస్కషన్ నడించింది. తర్వాత శివాజీపై గౌతమ్ కెమెరా ముందు నిలబడి సంచలన వ్యాఖ్యలు చేశాడు. శివాజీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేస్తున్నారని ఆరోపించాడు. హౌజ్‌ మొత్తం రాంగ్‌ రూట్‌లో వెళ్తుందని.. తప్పులు చేస్తూ కవర్ చేసుకుంటున్నాడని హౌస్ లో చాలా అన్యాయం జరుగుతుందని ఆరోపించడంతో పాటు తాను చేసిన ఆరోపణలో నిజం లేకపోతే.. డైరెక్ట్ ఎలిమినేట్‌ చేయాలని సూచించాడు. ఇక ఈ వారం హౌస్ నుంచి తేజు ఎలిమినేట్ అవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు… ఎవరు సేవ్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.