జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాక్.. ఇక ఆ సినిమా లేనట్టే.. మర్చిపోతే బెటర్..!
చాలా చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనను తాను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వాళ్లు అడక్కపోయినా కూడా చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు తారక్.

చాలా చాలా రోజుల తర్వాత అభిమానుల ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనను తాను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వాళ్లు అడక్క పోయినా కూడా చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చాడు తారక్. ఒకవైపు దేవర 2 సినిమా ముచ్చట్లు చెబుతూనే.. మరొకవైపు ప్రశాంత్ నీల్ సినిమా గురించి కూడా ఓపెన్ అయ్యాడు. నిన్న జరిగింది మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లా అనిపించలేదు.. ఎన్టీఆర్ ను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్ మీట్ లా కనిపించింది. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ కూడా ఇదే విషయం చెప్పాడు. మాకు ఇది మ్యాడ్ సినిమా ఫంక్షన్ చేసుకున్నట్లు లేదు.. దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ లా ఉంది అంటూ సంగీత్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. తన సినిమాల లైనప్ గురించి ఓపెన్ అయ్యాడు. రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు తాను ఏ సినిమాలు చేయబోతున్నాను అనే విషయం క్లారిటీగా అభిమానులతో పంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు తారక్.
దీని తర్వాత ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా ఉండబోతుంది. ఇది జనవరిలో విడుదల కానుంది. దీని తర్వాత దేవర 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు జూనియర్. నిజానికి దేవర 2 సినిమా ఉండదంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ వస్తుంది. జపాన్ లో కూడా ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో.. సీక్వెల్ ఆలోచనలు మానుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. దీని మీద కూడా క్లారిటీ ఇచ్చాడు జూనియర్. దేవర 2 కచ్చితంగా ఉంటుందని.. మధ్యలో ప్రశాంత్ నీల్ చెడు కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామని చెప్పాడు. అంతేకాదు డ్రాగన్ తర్వాత తాను ఇమీడియట్ గా మొదలు పెట్టబోయే సినిమా కూడా ఇదే అంటూ కన్ఫమ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. దాంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నట్టు చెప్పాడు తారక్.
ఇలా ఒకే ఈవెంట్లో ఎన్నో శుభవార్తలు చెప్పిన ఈయన.. ఒక సినిమా విషయంలో మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ రోజుల్లో కామెడీ సినిమా చేయడం చాలా కష్టమని.. ఒకరిని నవ్వించడం అంటే చిన్న విషయం కాదు అన్నాడు యంగ్ టైగర్. అందుకే తాను ఇకపై కామెడీ జోలికి వెళ్ళలేనేమో అని తేల్చేశాడు. అందరికీ తెలుసు ఎన్టీఆర్ కెరీర్ లో కామెడీ సినిమా అంటే అదుర్స్ అని. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాలో చారి పాత్రలో అదరగొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసిన అదుర్స్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అంటే చాలా ఏళ్ల నుంచి ఎన్టీఆర్ ను అడుగుతున్నారు అభిమానులు. దర్శకుడు వినాయక్ కూడా తనకు అదుర్స్ చేయాలని ఉందన్నాడు. రైటర్ కోన వెంకట్ కూడా అదుర్స్ 2 చేస్తామని కచ్చితంగా చెప్పాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇకపై తన నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయద్దు అని క్లారిటీ ఇచ్చేశాడు. అంటే ఈ లెక్కన అదుర్స్ 2 ఉండదని ఇన్ డైరెక్ట్ కాదు డైరెక్ట్ గా చెప్పేసాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది నిజంగా తారక్ అభిమానులకు పెద్ద షాక్.