నందమూరి అభిమానులకు షాక్.. మోక్షజ్ఞ విషయంలో ఈ ట్విస్ట్ ఊహించారా..?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే. ఆయనెప్పుడు వస్తాడా.. డెబ్యూతోనే రికార్డులు ఎప్పుడు బద్ధలు కొడతాడా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2025 | 05:30 PMLast Updated on: Apr 01, 2025 | 6:43 PM

Shock For Nandamuri Fans Did You Expect This Twist In Mokshagnas Story

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే. ఆయనెప్పుడు వస్తాడా.. డెబ్యూతోనే రికార్డులు ఎప్పుడు బద్ధలు కొడతాడా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ కుటుంబం నుంచి వారసుడు వచ్చి చాలా ఏళ్లైపోయింది. 20 ఏళ్ళ కింద కళ్యాణ్ రామ్ వచ్చిన తర్వాత మళ్లీ నందమూరి కుటుంబం నుంచి చెప్పుకోదగ్గర ఎంట్రీ లేదు. అందుకే నందమూరి వారసుడి కోసం అంతగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. పైగా మోక్షు వయసు కూడా 30 దాటిపోయింది. ఇంకెప్పుడు వస్తాడంటూ బాలయ్య ఎక్కడ కనిపిస్తే అక్కడ అడిగేస్తున్నారు అంతా. దానికి బాలయ్య కూడా ఓపిగ్గానే సమాధానం చెప్తున్నాడు. గతేడాది అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. కానీ అది ప్రకటన దగ్గరే ఆగిపోయింది.. ఇప్పటి వరకు ముందుకెళ్లలేదు.

పైగా ప్రశాంత్ వర్మ కూడా మోక్షు సినిమా కాదని.. మరో సినిమాతో బిజీ అయిపోయాడు. నెక్ట్స్ కూడా ఈయన ప్రభాస్ సినిమా చేస్తాడంటున్నారు. మరి ఈ లెక్కన నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇప్పట్లో లేనట్లేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. 2024, డిసెంబర్ 5న సినిమా పూజా కార్యక్రమాలు అని చెప్పారు.. కానీ చెప్పా పెట్టకుండా ముందు రోజు రాత్రి క్యాన్సిల్ చేశారు. అదేంటని అడిగితే.. బాబుకు ఆరోగ్యం బాలేదు అందుకే అని చెప్పాడు బాలయ్య. మరోవైపు ప్రశాంత్ వర్మ ఆ తర్వాత జై హనుమాన్ సినిమాతో పాటు నెక్ట్స్ ప్రభాస్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. అంటే ఆయన మరో రెండేళ్ల వరకు దొరకడు. మరోవైపు నందమూరి మోక్షజ్ఞ రెండో సినిమా చేస్తాడని చెప్పిన దర్శకుడు వెంకీ అట్లూరి వెళ్లి హీరో సూర్యకు కథ చెప్పి ఒప్పించాడు. ఈ సినిమా త్వరలోనే మొదలు కానుంది. అంటే ఇప్పట్లో వెంకీ కూడా దొరకడు. ఎందుకంటే ఈయన సూర్యకు మాత్రమే కాదు.. చిరంజీవి, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలకు కూడా కథలు చెప్పి ఉంచాడు. వీటిలో ఏ ఒక్కటి ఓకే అయినా రెండేళ్ల వరకు వెంకీ అట్లూరి సినిమా మోక్షుతో ఉండే ఛాన్సే లేదు.

వన్నీ చూస్తుంటే ఇప్పట్లో నందమూరి వారసుడి సినిమా ఉండటం కష్టమే అనిపిస్తుంది. అసలు మోక్షుకు నటనపై ఆసక్తి లేదనే సరికొత్త వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. తండ్రి మాట కాదనలేక ఓకే అన్నాడే గానీ నిజానికి మోక్షు ఫోకస్ అంతా బిజినెస్‌పైనే ఉందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఇది నిజమే అని నమ్మాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందిప్పుడు. మరోవైపు బాలయ్య మాత్రం ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999లో నందమూరి మోక్షజ్ఞ తప్పకుండా ఉంటాడని చెప్తూ వచ్చాడు. తాజాగా జరిగిన ఆదిత్య 369 రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం మోక్షు టాపిక్ అస్సలు తీసుకురాలేదు బాలయ్య. ఈ లెక్కన బాలయ్య కూడా కొడుకు ఇష్టాన్ని కాదనలేక కామ్ అయ్యాడేమో అనిపిస్తుంది.