ఫ్యాన్స్ కి షాక్, స్టార్ హీరో విడాకులు
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల వ్యవహారం సంచలనమే అవుతోంది. సినిమాల్లో సక్సెస్ అవుతోన్న స్టార్ హీరోలు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ లో అయినా సరే విడాకుల వ్యవహారాలు ఇప్పుడు ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల వ్యవహారం సంచలనమే అవుతోంది. సినిమాల్లో సక్సెస్ అవుతోన్న స్టార్ హీరోలు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ లో అయినా సరే విడాకుల వ్యవహారాలు ఇప్పుడు ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి. తమ అభిమాన హీరోలు ఇలా విడాకులు తీసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక రెండో వివాహాలు చేసుకోవడం కూడా ఫ్యాన్స్ కి చికాకుగానే మారుతోంది. అన్ని భాషల హీరోలు, హీరోయిన్ల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది.
తాజాగా మరో స్టార్ హీరో ఇప్పుడు విడాకులు తీసుకోవడం సంచలనం అయింది. తమిళ స్టార్ హీరో జయం రవి… తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన చేసాడు. అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసిన రవి… మీ ప్రేమ, ఆప్యాతకు ధన్యవాదాలు అంటూ… ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత, ఆర్తితో నా వైవాహిక జీవితాన్ని ముగించాలని కష్టమైనా, కఠినమైన నిర్ణయం తీసుకున్నా అంటూ ప్రకటించాడు. తొందరపాటుతో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో తాము విడిపోతున్నామని పేర్కొన్నాడు.
ఇద్దరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. తన కెరీర్ లో ఎన్నో విజయాలకు మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తమ కుటుంబ విషయం గురించి ఎక్కువ చర్చలు వద్దని విజ్ఞప్తి చేసాడు రవి. జయం రవి, ఆర్తి జూన్ 2009 లో వివాహం చేసుకున్నారు. వారికి ఆరవ్ మరియు అయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తన చిత్రాల ద్వారా నా చిత్రాల ద్వారా నా ప్రియమైన ప్రేక్షకులకు ఆనందాన్ని, వినోదాన్ని పంచేందుకు ప్రయత్నం చేస్తా అంటూ పోస్ట్ రాసాడు. తమిళంలో పలు హిట్ సినిమాలను తీసిన జయం రవి… తెలుగువాడే. ఆయన సోదరుడు మోహన్ రాజా… దర్శకుడిగా హిట్ సినిమాలను తెరకెక్కించారు.