బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ కండీషన్స్

ఇంకో మూడు రోజుల్లో బిగ్ బాస్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 8లో కచ్చితంగా ఆకట్టుకునే అంశాలు ఉంటాయని, గతంలో మాదిరిగా ఉండే ఛాన్స్ లేదని ప్రోమోతో బిగ్ బాస్ టీం స్పష్టంగా చెప్పింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2024 | 12:20 PMLast Updated on: Aug 29, 2024 | 12:20 PM

Shocking Conditions In Bigg Boss House

ఇంకో మూడు రోజుల్లో బిగ్ బాస్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 8లో కచ్చితంగా ఆకట్టుకునే అంశాలు ఉంటాయని, గతంలో మాదిరిగా ఉండే ఛాన్స్ లేదని ప్రోమోతో బిగ్ బాస్ టీం స్పష్టంగా చెప్పింది. బిగ్ బాస్ బజ్ ప్రోమో కూడా టీం విడుదల చేసింది. అందులో అర్జున్ అంబటి కాస్త ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ ఎలా ఉండబోతుంది అనే దానిపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి.

గత సీజన్ ఫ్లాప్ కావడంతో ఈ సీజన్ పై బిగ్ బాస్ యాజమాన్యం సీరియస్ గానే ఫోకస్ పెట్టి… షోలో కొన్ని మార్పులకు సిద్దమైంది. ఈ సీజన్ లో కొన్ని కఠిన నిర్ణయాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఎలిమినేట్ అయిన వాళ్ళను హౌస్ నుంచి పంపించే వారు. కాని ఈసారి మాత్రం అలా చేయట్లేదు ఎలిమినేట్ అయిన వాళ్ళు కొన్ని విషయాలను లీక్ చేస్తున్నారని గతంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనితో కీలక విషయాలు బయటకు వస్తున్నాయని బిగ్ బాస్ టీం భావిస్తోంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

బిగ్ బాస్ షో పూర్తయ్యే వరకు హౌస్ లోనే ఉండాలని ఇప్పటికే కంటేస్తేంట్ లకు చెప్పేశారు. షో మొదలైన రోజు నుంచి షో ముగిసే వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ల్యాండ్ లైన్ ఫోన్ లు మాత్రమే వాడాలని కండీషన్ పెట్టింది స్టార్ మా యాజమాన్యం. వారి కోసం ప్రత్యేకంగా ఒక ఇంటిని లేదా హోటల్ ను కేటాయిస్తారు. ఆ హోటల్ లోనే వారు ఉండాల్సి ఉంటుంది. వారితో పాటుగా ఒక ఫ్యామిలి మెంబర్ ను కూడా అనుమతిస్తారు. ఇక పీఆర్ టీంలతో మాట్లాడే విషయాలను కూడా వీడియోతో పాటుగా రికార్డ్ చేయనున్నారు. షో పూర్తయ్యే లోపు ఇంకెన్ని ఉంటాయో చూడాలి.