షాకింగ్: విక్రమ్ సీక్వెల్ లో దేవర…? ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్

దేవర సినిమా ఎన్టీఆర్ కు చాలా నేర్పింది. తెలుగు మార్కెట్ కంటే ఇతర భాషల్లో ఫోకస్ చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చేసాడు ఇప్పటికే. అందుకే ఇప్పుడు ఇతర భాషల మీద ఎక్కువగా ఫోకస్ చేసి కొడుతున్నాడు. దేవర సినిమా తెలుగు కంటే ఇతర భాషల్లో ఎక్కువగా ప్రమోట్ చేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 14, 2024 | 06:30 PMLast Updated on: Oct 14, 2024 | 6:30 PM

Shocking Devara In Vikrams Sequel Ntr Green Signal

దేవర సినిమా ఎన్టీఆర్ కు చాలా నేర్పింది. తెలుగు మార్కెట్ కంటే ఇతర భాషల్లో ఫోకస్ చేస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చేసాడు ఇప్పటికే. అందుకే ఇప్పుడు ఇతర భాషల మీద ఎక్కువగా ఫోకస్ చేసి కొడుతున్నాడు. దేవర సినిమా తెలుగు కంటే ఇతర భాషల్లో ఎక్కువగా ప్రమోట్ చేసాడు. ఇక అక్కడి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే హిందీ డబ్బింగ్ కూడా ఎన్టీఆర్ స్వయంగా చెప్పడం గమనార్హం. ఇక తమిళం, కన్నడం డబ్బింగ్ కూడా స్వయంగా ఎన్టీఆర్ చెప్పడం అక్కడి జనాలకు బాగా నచ్చింది.

ఇక తమిళం మార్కెట్ మీద ఎన్టీఆర్ కచ్చితంగా గురి పెట్టి అక్కడి స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఓ సినిమా కూడా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమా తమిళంలో చేసి తెలుగులో డబ్బింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ స్వయంగా చెప్పేసాడు. ఇక ఇప్పుడు దేవర సినిమా తర్వాత వార్ 2, అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమాలు వచ్చే ఏడాది ఒకటి ఆ తర్వాత ఒకటి విడుదల కానున్నాయి. ఆ తర్వాత దేవర వెట్రిమారన్ తో సినిమా చేస్తాడు.

ఇక ఇప్పుడు వస్తున్న మరో వార్త లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో ఎన్టీఆర్ భాగం కానున్నాడు అని తెలుస్తోంది. విక్రమ్, ఖైదీ, లియో సినిమాలు లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో వచ్చాయి. తర్వాత కూలి సినిమా వస్తోంది. కూలి తర్వాత ఖైదీ సినిమా చేయనున్నాడు లోకేష్ కనగరాజ్. ఆ తర్వాత విక్రం సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది. అయితే విక్రమ్ సీక్వెల్ లో ఎన్టీఆర్ ను తీసుకునే ఛాన్స్ ఉందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఎన్టీఆర్ తో చర్చలు జరపగా ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ ని తెలుగులో కూడా పాపులర్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నాడు. ఆ సీరీస్ లో దాదాపు ఆరు సినిమాలు ఉండే అవకాశం ఉంది. వాటికి తెలుగులో కూడా మంచి క్రేజ్ వస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. ఇక రోలెక్స్ పాత్రతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఇలా ఇప్పుడు లోకేష్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ ను భాగం చేస్తే కన్నడంలో కూడా ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నాడు. తెలుగు మార్కెట్ లో ఎన్టీఆర్ కు తిరుగు లేదు కాబట్టి లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ పై అంచనాలు పెంచవచ్చని భావిస్తున్నాడు.