షాకింగ్: బాలీవుడ్ మాజీ హీరోయిన్ పై లారెన్స్ బిష్ణోయ్ గురి…?

బాలీవుడ్ లో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతోంది. సినిమాల్లో విలన్ గ్యాంగ్ లను ఒంటి చేత్తో మట్టి కరిపించే స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ దెబ్బకు కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2024 | 07:02 PMLast Updated on: Oct 16, 2024 | 7:02 PM

Shocking Former Bollywood Heroine Lawrence Bishnoi Guri

బాలీవుడ్ లో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతోంది. సినిమాల్లో విలన్ గ్యాంగ్ లను ఒంటి చేత్తో మట్టి కరిపించే స్టార్ హీరోలు ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ దెబ్బకు కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ భయంతో వణికిపోతున్నాడు. ఈ తరుణంలో మాజీ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది జూన్ 1న ముంబైలోని కార్టర్ రోడ్డులో రిజ్వీ కాలేజ్ దగ్గర ఒక ఘటన జరిగింది. రవీనా కారు ర్యాష్ డ్రైవింగ్‌ తో వచ్చి ఒక మహిళను ఢీ కొట్టిందని ఆమెపై కేసు నమోదు చేసారు.

ఆ సమయంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో గమనిస్తే కారు రివర్స్ చేసే సమయంలో ఒక మహిళ అడ్డుగా వచ్చింది. ఆమెకు కారు తగలకపోయినా… రవీనా డ్రైవర్ ను మాత్రం కొందరు కొట్టారు. రవీనా అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడి చేసారు ఒక గ్యాంగ్. తనను కొట్టవద్దని ఆమె వేడుకోవడం ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత పోలీసులు విచారణ చేయగా అందులో హీరోయిన్ గాని ఆమె డ్రైవర్ తప్పు గాని లేదని వెల్లడి అయింది. దీనిపై తాజాగా రవీనా కీలక వ్యాఖ్యలు చేసింది.

తనపై అటాక్ జరిగిన మరుసటి రోజే రిచా చద్దాపై కూడా ఇలాగే దాడి చేసారని చెప్పింది. ఓ గుంపు ఆమెపై కూడా ఇలానే దాడి చేసినట్టు తనకు తెలిసిందని… ఇదంతా డబ్బుకోసం ఓ గుంపు ముందస్తుగా చేసుకున్న స్కెచ్ అని రిచా అటాక్‌ తో పాటు పోలీసులు కూడా చెప్పడంతో షాక్ అయ్యాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ తరహా ఘటనలు ముంబైలో ఎక్కువయ్యాయని ఆమె చెప్పింది. ఆ గ్యాంగ్ అంతా భయపెట్టి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలనే ప్లాన్‌లో తిరుగుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని పేర్కొంది.

రిచా చద్దా కూడా నాకు ఫోన్ చేసి.. నీకు ఎలా అయితే జరిగిందో.. నాకు కూడా అలానే జరిగిందని తనకు చెప్పినట్టు వివరించింది. కానీ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో.. పోలీసుల ద్వారా సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురైందని వివరించింది. తర్వాత పోలీసులే.. ఇదంతా డబ్బుకోసం ఓ గ్యాంగ్ చేస్తున్న పనిగా పోలీసులు కూడా గుర్తించారని తెలిపింది. నా విషయంలో కూడా బెదిరించి ఎలాగైనా డబ్బు వసూలు చేయాలనే అలా అటాక్ చేశారని… తనకు బాగా గుర్తుందని వారిలో కొందరు చాలా దూకుడుగా ఉన్నారని… ఇంట్లోకి చొరబడి.. తన స్టాఫ్‌ లోని మగవాళ్లని కూడా కొట్టారని చెప్పింది.

అప్పుడు తాను, తన స్టాఫ్‌ లోని మరో ఇద్దరు అమ్మాయిలు గేటుకి అడ్డంగా నిలబడి వారిని లోనికి రానియకుండా అడ్డుగా నిలబడ్డామని అయినా వినలేదని… డ్రైవర్ ను అప్పగించాలని దాడికి దిగారని ఆమె తెలిపింది. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వస్తున్నాయి. ముంబైలో లారెన్స్ గ్యాంగ్ ఆగడాలు ఎక్కువయ్యాయని… వారే బాలీవుడ్ యాక్టర్ లను టార్గెట్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.