దేవర 172 కోట్లని దాటిందే ల్యే… 165 కోట్ల దగ్గరే తగ్గాడు..
దేవర రిలీజ్ కి ముందు ఎంత నెగెటివిటీని, కౌంటర్స్ ని, ట్రోలింగ్స్ ని ఫేస్ చేసిందో, అంతే వ్యతిరేకతను పుష్ప2 ఫేస్ చేసింది. కాని దేవర ఏటికి ఎదురీది గట్టెక్కాడు. దూసుకెళ్లాడు. ఇప్పడు పుష్ప 2 కూడా అలానే చేస్తుందన్నారు. ప్రివ్యూ చూసిన ఫ్యాన్స్ అండ్ కో మాత్రం దేవరని సైడ్ చేసేస్తాడు పుష్పారాజ్ అనేశాడు.
దేవర రిలీజ్ కి ముందు ఎంత నెగెటివిటీని, కౌంటర్స్ ని, ట్రోలింగ్స్ ని ఫేస్ చేసిందో, అంతే వ్యతిరేకతను పుష్ప2 ఫేస్ చేసింది. కాని దేవర ఏటికి ఎదురీది గట్టెక్కాడు. దూసుకెళ్లాడు. ఇప్పడు పుష్ప 2 కూడా అలానే చేస్తుందన్నారు. ప్రివ్యూ చూసిన ఫ్యాన్స్ అండ్ కో మాత్రం దేవరని సైడ్ చేసేస్తాడు పుష్పారాజ్ అనేశాడు. కట్ చేస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ వచ్చాక లెక్కలు తప్పాయి.. దేవర 172 కోట్ల రికార్డుని పుష్ప2 మూవీ బ్రేక్ చేయలేదని తేలింది. విచిత్రం ఏంటంటే సౌత్ లో మరీ ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్ లో పుష్పరాజ్ కి మరీ భారీగా బ్యాడ్ టాక్ పెరిగింది. మొన్నటి వరకు ఇదంతా యాంటీ ఫ్యాన్స్ మాయే అన్నారు. కాని కామన్ ఆడియన్స్ నుంచి కూడా కామన్ గా నెగెటీవ్ టాకే పెరుగుతున్నట్టే కనిపిస్తోందంటున్నారు.. నిజమేనా?
పుష్ప 2 ఇకనుంచి నైజాం కింగ్ అన్నారు. కాని వరల్డ్ వైడ్ గా దేవర రికార్డు బ్రేక్ చేయటం కాదు, కనీసం టచ్ చేయలేదు. ఒకటి యూఎస్ లో కల్కీ తాలూకూ 5.5 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ ని పుష్ప2 బ్రేక్ చేయలేకపోయింది. ఇక దేవర వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ని కూడా పుష్ప2 టచ్ చేయలేకపోయింది.
ఐతే నైజాంలో మాత్రం పుష్ప2 ఓపెనింగ్స్ ఊహించిన దానికంటే ఘనంగానే వచ్చాయి. నైజాంలో త్రిబుల్ ఆర్ 23 కోట్ల ఓపెనింగ్స్ రాబడితే, పుష్ప 2 నైజా వసూల్లు 26 కోట్లని తెలుస్తోంది. అంటే మూడు కోట్లు అదనంగానే పుష్ప2 మూవీ నైజాంలో వసూళ్ చేసింది. మొదటి రోజు వసూళ్ల విషయంలో నైజాం నిజంగానే పుష్పరాజ్ దూసుకెళ్లాడు.
కాని వరల్డ్ వైడ్ గా మొదటి రోజు వచ్చిన వసూళ్లని లెక్కేస్తే మాత్రం, పుష్పరాజ్ వెనకబడ్డట్టే కనిపించాడు. ప్రపంచ వ్యాప్తంగా దేవర 172 కోట్ల ఓపెనింగ్స్ ని రాబడితే, పుష్ప 2 మాత్రం మొదటి రోజు,అలానే ప్రివ్యూ వసూల్ల తో కలిసిప 167 కోట్లు రాబట్టాడు. తెలగుు వర్షన్ కి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్లు వస్తే, 66 కోట్లు కేవలం హిందీ నుంచే వచ్చాయి. ఇక ఓవర్ సీస్ వసూళ్లను కూడా కలుపుకుంటే, మొదటి రోజు పుష్ప2 వసూళ్లు 167 కోట్లు రాబట్టింది.
ఐతే దేవర, కల్కీ ఈ రెండు మూవీలని పుష్ప సీక్వెల్ దాటలేకపోయినా, త్రిబుల్ ఆర్ తాలూకు రికార్డుని మాత్రం బ్రేక్ చేసింది పుష్ప2 మూవీ. త్రిబుల్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 133 కోట్లు రాబడితే, దానికి కనీసం 34 కోట్లు అధికంగా రాబట్టింది పుష్ప2 మూవీ. కాని దీనికంటే కాస్త ముందొచ్చిన దేవర, కల్కీ తాలూకు వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ని మాత్రం టచ్ కూడా చేయలేకపోయింది పుష్పరాజ్ క్రేజ్.