బెజవాడపై షార్ట్ ఫిలిమ్స్, టాలీవుడ్ కి స్ట్రిక్ట్ ఆర్డర్స్
విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక రాజధానిగా, ఇప్పుడు నూతన రాజధాని అమరావతికి అండగా నిలబడిన విజయవాడ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఒకవైపు కృష్ణా నది, మరో వైపు బుడమేరు వాగు దెబ్బకు బెజవాడ ప్రజలు బ్రతికి ఉండగానే నరకం అంటే ఏంటో చూసారు.
విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక రాజధానిగా, ఇప్పుడు నూతన రాజధాని అమరావతికి అండగా నిలబడిన విజయవాడ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఒకవైపు కృష్ణా నది, మరో వైపు బుడమేరు వాగు దెబ్బకు బెజవాడ ప్రజలు బ్రతికి ఉండగానే నరకం అంటే ఏంటో చూసారు. బెజవాడ ఇప్పట్లో సాధారణ పరిస్థితికి రావడం అనేది కష్టమే. ప్రభుత్వం గాని స్వచ్చంద సేవా సంస్థలు గాని ఎంత కష్టపడి పని చేసినా సరే… సాధారణ పరిస్థితి రావడానికి కనీసం ఏడాది పడుతుంది.
కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఒకరు అయితే… అప్పటి వరకు తాము నివసించిన ఇళ్ళు అలా వరదలో ఉండిపోవడం చూసి చాలా మంది గుండె పగిలిపోతుంది. ఇక వేల రూపాయలు ఖర్చు చేసి కొనుక్కున్న వస్తువులు పాడైపోయిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం అనే చెప్పాలి. వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, మంచం, టీవీ ఇలా వేలు ఖర్చు చేసి కొనుక్కుని ఉంటారు. అవన్నీ ఇప్పుడు వరద దెబ్బకు పాడైపోయాయి. వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అవి కొనుక్కోవడం కూడా సాధ్యం అయ్యే పని కాదు.
అందుకే ఇప్పుడు ప్రభుత్వం తాను చేసేది చేస్తూనే… ఇతరులు కూడా సాయం కోసం ముందుకు రావాలని కోరుతోంది. ఈ మేరకు… కొన్ని షార్ట్ ఫిలిమ్స్… బాధితుల కోసం షూట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం సినిమా పరిశ్రమ సహకారం తీసుకొనే యోచనలో ఉన్నారు. బాధితులకు సంబంధించి వివిధ రకాల సమస్యలను చూపిస్తూ కనీసం 30 షార్ట్ ఫిలిమ్స్ అయినా ప్లాన్ చేయాలని చూస్తున్నారు.
వీటిని ఓటీటీలలో ప్రదర్శించే సినిమాలకు ముందు, అలాగే థియేటర్ లో ప్రదర్శించే సినిమాల్లో సినిమా కంటే ముందు, ఇంటర్వెల్ ముందు ప్రదర్శించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో విడుదల అయ్యే ప్రతీ సినిమా ముందు ఇవి ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అవసరమైతే ఒక జీవో కూడా ప్రభుత్వం తీసుకు రానుంది. అలాగే యూట్యూబ్ చానల్స్ తో కూడా ప్రభుత్వం చర్చలు జరిపి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని చూస్తున్నారు.