వాడు నన్ను వాడుకుని ఇంకో దాంతో ఆ పని చేసాడు: శ్రష్టి వర్మ సెన్సేషన్

లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బాగా సెన్సేషన్ అయిన కేస్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం. ఒక జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ వేధిస్తున్నారని స్వయంగా ఆ డాన్స్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 28, 2025 | 12:26 PMLast Updated on: Jan 28, 2025 | 12:26 PM

Shrasti Varma Sensational Comments

లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బాగా సెన్సేషన్ అయిన కేస్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం. ఒక జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ వేధిస్తున్నారని స్వయంగా ఆ డాన్స్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జానీ మాస్టర్ ఈ వ్యవహారంలో ఇరుక్కోవడంతో ఒక వర్గం బాగా ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అటు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా ఈ విషయంలో ఆరోపణలు వచ్చాయి.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను జానీ మాస్టర్ ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక జానీ మాస్టర్ కొన్నాళ్లపాటు జైల్లో కూడా ఉండి ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేయడంతో.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. అయితే ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ఇరుక్కోవడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అంటూ ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్ అరెస్టు అయిన తర్వాత శ్రష్టి వర్మతో అల్లు అర్జున్ ఫోన్లో మాట్లాడాడని అల్లు స్టూడియోస్ లో ఆమెకు ఉద్యోగం ఇస్తానని చెప్పాడని అలాగే తాను చేయబోయే ప్రతి సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇస్తానని చెప్పాడని ప్రచారం జరిగింది.

దీనితో కచ్చితంగా ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర కూడా ఉందని మెగా అభిమానులు కొంతమంది కామెంట్ చేశారు. ఇక జానీ మాస్టర్ ను అభిమానించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కొన్ని సెన్సేషనల్ విషయాలను కూడా బయటపెట్టారు. దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారని కూడా కొంతమంది ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇక ఈ కేసు పై కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ మాట్లాడుతూ ఈ కేసులో ఎలాంటి కుట్రలేదని అల్లు అర్జున్ కి ఈ కేసుతో అసలు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

జానీ మాస్టర్ పై తాను కక్షతో కేసు వేయలేదని తన ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా ముందుకు వచ్చాను అని క్లారిటీ ఇచ్చింది. ఒక అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకొని తర్వాత తన స్థానంలో మరో అమ్మాయిని పెట్టడం సరైనదా అంటూ ఆమె నిలదీసింది. జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దుకు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా చెప్పింది. తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఆఫర్ చేశారని అయితే ఆఫర్ ను తాను రిజెక్ట్ చేశానని తాను ఎవరికి భయపడే వ్యక్తిని కాదంటూ స్పష్టం చేసింది. ఈ లైంగిక వేధింపుల కేసు విషయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని సృష్టి వర్మ ఓ పాడ్ కాస్ట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మాయి ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం వర్క్ చేస్తోంది.