Shruti Haasan: సలార్ బ్లాక్‌బస్టర్ ఖాయం.. శృతి సెంటిమెంట్ కలిసొచ్చేనా..?

ప్రశాంత్ నీల్‌కి తోడు శృతి హాసన్ రూపంలో పాజిటివ్ సెంటిమెంట్ తోడైంది. ఫ్లాప్స్‌లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చే హీరోయిన్‌గా శృతికి పేరుంది. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 04:48 PMLast Updated on: Dec 21, 2023 | 4:48 PM

Shruti Haasan Give Blockbuster To Prabhas With Salaar

Shruti Haasan: బాహుబలి మూవీలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలతో నిరాశపరిచాడు. ‘బాహుబలి’ తర్వాత ఆయన నటించిన ‘సాహో’ సినిమా నార్త్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, ఓవరాల్‌గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గానే మిగిలింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది వచ్చిన ‘ఆదిపురుష్’ కూడా అదే బాటలో పయనిస్తూ పరాజయం పాలైంది.

Sandeep Reddy Vanga: అజ్ఞానులు.. రివ్యూయర్లపై సందీప్ రెడ్డి వంగా పంచ్..

ఇలా ‘బాహుబలి-2’ తర్వాత ప్రభాస్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నాడు. దీంతో విడుదలకు సిద్ధమైన ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’పైనే ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పైగా ఈ సినిమాకి శృతి హాసన్ సెంటిమెంట్ తోడైంది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్న చిత్రం ‘సలార్’. ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడం దీనికి ప్రధాన కారణం. ప్రశాంత్ నీల్‌కి తోడు శృతి హాసన్ రూపంలో పాజిటివ్ సెంటిమెంట్ తోడైంది. ఫ్లాప్స్‌లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చే హీరోయిన్‌గా శృతికి పేరుంది. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది.

ALLU ARJUN: బన్నీ ఫ్యాన్స్ తలెత్తుకునే డిసిషన్.. పాట షూట్ కోసం డేరింగ్ స్టెప్

పరాజయాలతో కెరీర్ ప్రారంభించిన శృతికి తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’లో నటించే అవకాశం లభించింది. ‘ఖుషి’ నుంచి ‘గబ్బర్ సింగ్’ వరకు పదేళ్లపాటు పవన్ వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. మధ్యలో ‘జల్సా’ మాత్రమే ఆకట్టుకుంది. అలాంటి సమయంలో శృతి హీరోయిన్‌గా నటించిన ‘గబ్బర్ సింగ్’ ఆమెకి మొదటి ఘన విజయాన్ని అందించడమే కాకుండా, అప్పటికి పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ వస్తోంది శృతి. ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంతో పరాజయం అందుకున్న అల్లు అర్జున్‌కి ‘రేసుగుర్రం’ రూపంలో బ్లాక్ బస్టర్ అందించింది.

‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి పరాజయాల తర్వాత మహేష్ బాబుకి ‘శ్రీమంతుడు’ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ వంటి బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ తర్వాత.. శృతి హీరోయిన్‌గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు చిరంజీవి. ఇక ప్లాప్స్‌లో ఉన్న రవితేజకు ‘బలుపు’, ‘క్రాక్’ రూపంలో రెండుసార్లు బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది శృతి. ఇలా ప్లాప్స్‌లో ఉన్న హీరో సరసన శృతి హాసన్ నటిస్తే.. ఆ సినిమా హిట్ అవ్వడమే కాకుండా ఆయా హీరోల కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. ఇదే సెంటిమెంట్ ‘సలార్’కి రిపీట్ అవుతుందేమో చూడాలి.