Love Story: ముదిరి పాకాన పడుతున్న సిద్దార్ట్.. అతిధి ప్రేమ
సిద్దార్డ్..అతిధి రావు హైద్రి ..పెళ్లిళ్లు పేరంటాలకు.. ఫంక్షన్స్‌కు మొగుడు పెళ్ళాల్లా.. కలిసి వెళ్తారు. కానీ లవర్స్ అని ఒప్పుకోరు. ప్రీమియర్ షోకు చేయి చేయి పట్టుకుని వస్తారు. కానీ..ఈ ఇద్దరి మధ్య వున్నది బైట పెట్టరు.
ఇద్దరూ ఒకే ఇంట్లో వుంటారు. ప్రేమించుకుంటున్నారా అని అడిగితే సమాధానం చెప్పకపోగా వీళ్లకు కోపం వస్తుంది. చెప్పినా తిన్నగా సమాధానం చెప్పరు. అసలు విషయం చెప్పడకుండా మాట దాటేస్తారు. ఈ ఇద్దరు రీసెంట్గా ముంబైలో జూబ్లీ వెబ్ సిరీస్ ప్రీమియర్‌లో తళుక్కుమన్నారు. ఇంకోనెలలో పెళ్లవుతున్న జంటలా చిరునవ్వులు చిందిస్తూ.. కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ జంటను చూసిన ఫొటోగ్రాఫర్స్.. లవ్‌లీ జోడీ అంటే అదితి సిగ్గుపడిపోయింది.
అదితి, సిద్దార్థ లవ్‌స్టోరీ ముదిరి పాకాన పడుతోంది. రెండేళ్ల క్రితం మహాసముద్రం సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సినిమాలో ఈ ఇద్దరి లవ్‌స్టోరీ ఫెయిల్ అయినా..బైట మాత్రం సక్సెస్ అయింది. రెండేళ్లుగా సహ జీవనం సాగిస్తున్నారు. అలాగని ప్రేమ వుందని చెప్పరు.. పెళ్లి టాపిక్ ఎవరు తీసుకొచ్చినా ఊరుకోరు.
అదితిరామ్ హైదరీ, సిద్దార్థ పెళ్లి చేసుకుంటే.. వీళ్లిదరికీ ఇది రెండో పెళ్లి అవుతుంది. గతంలో వీరిద్దరూ పెళ్లయి విడాకులు తీసుకున్నారు. డేటింగ్ రూమర్స్‌పై ఈ ఇద్దరూ స్పందించకపోయినా.. ఎప్పుడూ వార్తల్లోనే వుంటున్నారు. శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు ఈ ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆమధ్య విశాల్ సినిమా ‘ఎనిమీ’లోని ‘టమ్ టమ్ ‘ సాంగ్‌కు స్టెప్పులేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది అదితి. ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశారు. చివర్లో అదితి చిలిపిగా నడుముతో ఓ తన్ను తంతే.. ప్రియుడు అవతల పడ్డాడు. ఇలాంటి ఎవ్వరాలు ఈ మధ్య చాలా చేశారు ఇద్దరు. ఆ అనౌన్సమెంట్ ఏదో ఇచ్చేస్తే పని ఐపోద్దిగా అంటే మాత్రం పెదవి విప్పరు.