పుష్ప అంటే బీరు బిర్యానీనా..? టాక్ వీకైనా అరవ అసూయ భరించలేం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3 ఏళ్ల కష్టపడి సినిమా తీస్తే థియేటర్స్ కి జనం రావట్లేదు.. బీరుకి బిర్యానికి కక్కుర్తి పడి వస్తున్నారని అన్నాడో స్టార్. ఇప్పుడీ మాటలు వైరలయ్యాయి. ఒకవైపు పుష్ప2 మీద మిక్స్ డ్ టాక్ వస్తోంది.మరో వైపు నార్త్ లో భారీ వసూళ్ల వరదొస్తోంది... ఇలాంటి టైంలో యాంటీ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ నుంచి కూడా భారీగా వ్యతిరేకత పెరిగింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3 ఏళ్ల కష్టపడి సినిమా తీస్తే థియేటర్స్ కి జనం రావట్లేదు.. బీరుకి బిర్యానికి కక్కుర్తి పడి వస్తున్నారని అన్నాడో స్టార్. ఇప్పుడీ మాటలు వైరలయ్యాయి. ఒకవైపు పుష్ప2 మీద మిక్స్ డ్ టాక్ వస్తోంది.మరో వైపు నార్త్ లో భారీ వసూళ్ల వరదొస్తోంది… ఇలాంటి టైంలో యాంటీ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ నుంచి కూడా భారీగా వ్యతిరేకత పెరిగింది. ఈ గందరగోలంలో మైత్రీ మేకర్స్ ఎనౌన్స్ చేస్తున్న సినిమా వసూళ్ల మీద చాలా డౌట్లున్నాయంటూ కూడా చాలా వాదనలు వినిపిస్తున్నాయి.. ఎగ్జాక్ట్ గా ఇలాంటి టైంలో మాటల తూటా పేల్చాడు హీరో సిద్దూ… నిజానికి పుష్ప2 కి టాక్ ఎలా ఉన్నా నార్త్ లో వసూళ్లొస్తున్న మాట వాస్తవమే.. వాళ్లు చెప్పేంత వసూల్లు కాకున్నా మరీ తమిళ సినిమాలతో పోల్చుకునే దుస్తితి తెలుగు మూవీకి రాలేదు. ఆల్రెడీ అరవోళ్లకి పాన్ ఇండియాలో ఏమీ ఇరగతీయలేకపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ ఉంది… టాలీవుడ్ మూవీ అసూయ ఉంది.. కాబట్టే ఆ కసిని, టైం చూసి తెలుగు మూవీలకు మసిపూసే ప్రయత్నం చేస్తున్నాడా? ఇంతకి బీర్ బిర్యానీ కామెంట్ల వెనకున్న కారణాలేంటి?
పుష్ప2 వచ్చింది మొదటి రోజు హిట్ టాక్ ని, రెండో రోజు రివర్స్ టాక్ ని సొంతం చేసుకుంది. కాని హిందీ లో మాత్రం బానే ఆడుతోందనే మాటే వినిపిస్తోంది. కేవలం కలెక్షన్స్ తాలూకు అతి లెక్కల మీదే డౌట్లు ఉన్నాయంటున్నారు. ఇలాంటి టైంలో పుష్ప2 కోసం వచ్చే జనాలను బీర్ కోసం, బిర్యానికోసం క్యూ కట్టే బ్యాచ్ అనేశాడు హీరో సిద్దార్థ్..
నిజానికి తన సినిమా మిస్ యూ పుష్ప2 తో పాటు విడుదలవ్వాలి. కాని పుష్ప 2 ని చూసి భయపడుతున్నారా అంటే, అసలు పుష్ప2నే తన మూవీని చూసి భయపడాలన్నాడు. ఇదంతా నిజానికి పుష్ప 2 రిలీజ్ కి ముందు ఓ ఇంటర్వూలో బొమ్మరిళ్లు సిద్దార్ధ్ చేసిన కామెంట్స్… కాని ఇప్పుడే అవి వైరలయ్యాయి.
నిజానికి పుష్ప2 రిలీజ్ కి ముందు బీహార్ లో చేసిన ఈవెంట్ కి లక్షల్లో జనం వస్తే, వాల్లంతా బీరు, బిర్యానికోసం ఎగబడే బ్యాచ్ అన్నాడు. చిన్న లౌైడ్ స్పీకర్ పెడితే చాలు మన దేశం లో జనం గుమ్మిగూడతారు. డబ్బులిస్తే జనం సభలకొస్తారు.. ఆమాత్రానికే పార్టీలు పెట్టే సభలకోసం జనం ఎగబడుతున్నారనుకోగలమా అని డౌట్ రేయిజ్ చేశాడు
మరి పుష్ప2 కోసం జనా రాలేదు. బీర్, బిర్యానికోసమే వస్తే, థియేటర్స్ లో వసూల్లెలా వస్తున్నాయి.. అవి కూడా నిర్మాతలే కొంటున్నారా అని తెలుగు ఆడియన్స్ బానే కౌంటర్ ఇస్తున్నారు. కాకపోతే సోషల్ మీడియాలో ఆల్రెడీ మెగా బ్యాచ్, అలానే యాంటీ బన్నీ ఫ్యాన్స్ పుష్పా 2 మీద కామెంట్ల తో దాడి చేయటం వెనక చాలా కారణాలున్నాయి.
అలానే పుష్ప2 కూడా అద్భుతంగా ఉందనే పరిస్థితి లేదు. రివ్యూలే కాదు కామన్ ఆడియన్స్ నుంచి టాక్ కూడ వీక్ గానే వస్తోంది.. ఇది సౌత్ వర్షన్ .. ఇదెంత నిజమో, నార్త్ లో పుష్ప2కి వసూళ్లు బాగున్నాయనేది అంతే నిజం… ఐతే కాసేపు పుష్ప 2 వసూళ్ల లెక్కల్లో లోతులు పక్కన పెడితే…. డెఫినెట్ గా తమిల్ మూవీలతో పోలిస్తే, కల్కీ, దేవర, పుష్ప2 పాన్ ఇండియాని షేక్ చేశాయి.. భారతీయుడు2, వెట్టయాన్, కంగువా ఫ్లాపయ్యాయి…
సోపాన్ ఇండియా ని ఎలా షేక్ చేయాలో తెలియక తమిళ తంబీలు కంగారు పడుతుంటే,తెలుగు హీరోలు పాన్ ఇండియానికుదిపేస్తున్నారు.. ఈ అసూయతోనే తమిళ తంబీ సిద్దూ ఇలా తెలుగు మూవీని బీర్ , బిర్యానితో పోల్చటం వివాదంగా మారుతోంది.