Siddharth: ఒక్కటయ్యారు.. హీరోయిన్‌తో సిద్దార్థ్ సీక్రెట్ మ్యారేజ్..
తాజాగా సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా లవ్‌లో ఉన్న అధితి హైదరితో ఆయన వివాహం జరిగిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ సుందరి అప్పటికే చాలా కాలంగా తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.
Siddharth: లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాలకు కూడా కోలీవుడ్‌తో పోటీగా టాలీవుడ్‌లో మార్కెట్ ఉంటుంది. బొమ్మరిల్లు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మనుసు దోచుకున్న ఈ హీరో చాలా మంది హీరోయిన్ల మనసుదోచినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇవన్ని పక్కన పెడితే.. తాజాగా సిద్దార్థ్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. చాలా కాలంగా లవ్‌లో ఉన్న అధితి హైదరితో ఆయన వివాహం జరిగిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
AP Common Capital out : జూన్ 2 తర్వాత హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం అద్దెలు కట్టాల్సిందే !
సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ సుందరి అప్పటికే చాలా కాలంగా తమిళ్, మలయాళం చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఆ తరువాత అంతారిక్షం, వీ, మహాసముద్రం సినిమాలో నటించింది. అయితే మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే హీరో సిద్ధార్థ్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత కొన్నాళ్లు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు. ఇరువురి అభిప్రాయాలు కలువడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు. అప్పటికే వీరిద్దరు తమ తమ వివాహ బంధం నుంచి సపరేట్ అయిన వారే కావడంతో, వీరి మధ్య స్నేహం, ప్రేమ బలపడింది. దీంతో వనపర్తి జిల్లాల్లోని శ్రీరంగపురం ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిద్దార్ధ్‌కి 2003లో మేఘన అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత 2007లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. హీరోగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్దార్ధ్.. విడాకుల తర్వాత పలువురితో ప్రేమాయణం నడిపినట్లు వార్తలొచ్చాయి. అందులో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు.
ఒకరిద్దరితో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ఆ ప్రేమ కథలు పెళ్లి వరకు చేరలేదు. అయితే కొంతకాలంగా అదితిరావుతో ప్రేమలో ఉన్నాడు సిద్ధార్థ్. వీరిద్దరూ కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు సమాచారం. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగిన పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ సంవత్సరమే సిద్ధార్థ్, అదితిరావు పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమైనట్లు సమాచారం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారట. కాగా, అదితిరావుకి కూడా గతంలోనే పెళ్లి జరగగా, ఏవో కారణాల వల్ల కొంతకాలానికే భర్త నుంచి విడాకులు తీసుకుంది.