Siddu Jonnalagadda: టిల్లూతో ఇద్దరు భామల రొమాన్స్‌.. ఆ హీరోయిన్లకు ఛాన్స్..!

కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన మెగా ఫోన్‌ పట్టి డైరెక్ట్‌ చేస్తున్న మూవీ 'తెలుసు కదా'లో సిద్దు హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్‌‌గా రిలీజ్‌ చేసిన వీడియోలో హీరోయిన్స్‌ను ఎనౌన్స్‌ చేశారు. కేజీఎఫ్‌ భామ శ్రీనిధి శెట్టి.. రాశిఖన్నా సిద్దుతో రొమాన్స్‌ చేయనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 18, 2023 | 07:38 PMLast Updated on: Oct 18, 2023 | 7:38 PM

Siddu Jonnalagadda Gives Chance To Flop Heroines

Siddu Jonnalagadda: క్రేజీ యూత్‌ఫుల్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు ఫేడౌట్‌ హీరోయిన్స్‌కు లైఫ్‌ ఇచ్చాడు. ఏడాది నుంచి ఖాళీగా వున్న భామలను ఏరికోరి తీసుకున్నాడు. టిల్లుతో రొమాన్స్‌ చేసేందుకు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు సిద్ధమయ్యారు. డిజె టిల్లు సీక్వెల్‌ టిల్లు స్క్వేర్‌ పూర్తికాకుండానే.. మరో సినిమా స్టార్ట్ చేసేశాడు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన మెగా ఫోన్‌ పట్టి డైరెక్ట్‌ చేస్తున్న మూవీ ‘తెలుసు కదా’లో సిద్దు హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్‌‌గా రిలీజ్‌ చేసిన వీడియోలో హీరోయిన్స్‌ను ఎనౌన్స్‌ చేశారు.

కేజీఎఫ్‌ భామ శ్రీనిధి శెట్టి.. రాశిఖన్నా సిద్దుతో రొమాన్స్‌ చేయనున్నారు. రాశిఖన్నాకు స్టార్‌‌ కాలేకపోయినా.. స్టార్స్‌కు మించిన క్రేజ్‌ వుంది. చూడ్డానికి అందంగా వుంటుంది. యాక్టింగ్‌ బాగుంటుంది. అన్నీ వున్నా.. ఈ అమ్మడి విషయంలో సక్సెస్‌ అందని ద్రాక్షగా మారింది. ఫ్లాపులు వెంటాడినా తెలుగులో ఏదో ఒక సినిమాతో బిజీగా వుండే రాశికి థ్యాంక్యూ ఫ్లాప్‌ తర్వాత ఏడాదికి పైగా మరో ఆఫర్‌ దక్కలేదు. రాశిఖన్నా ఏడాది నుంచి సోషల్‌ మీడియా వేదికగా గ్లామర్‌ గుప్పిస్తూనే వుంది. తమిళంలో ఒకట్రెండు సినిమాలు చేస్తున్నా.. తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవడంలేదు. ఎట్టకేలకు మహిళా దర్శకురాలు నీరజ కోన.. రాశికి హీరోయిన్‌ ఛాన్స్‌ ఇచ్చింది. మిస్‌ కర్నాటకగా ఎంపికైన శ్రీనిధి శెట్టిని ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌తో వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇందులో చిన్న పాత్రే కావడంతో గుర్తింపు దక్కలేదని సరిపెట్టుకున్నా.. కేజీఎఫ్‌2లో ఇంపార్టెంట్‌ రోలే పడింది. కేజీఎఫ్‌తో రాని గుర్తింపు కేజీఎఫ్‌2తో వచ్చినా.. 18 నెలలుగా మరో క్రేజీ మూవీకి సైన్‌ చేయకపోవడం విశేషం.

కెజిఎఫ్‌2 సెట్స్‌పై వుండగానే శ్రీనిధి శెట్టి విక్రమ్ ‘కోబ్రా’లో ఛాన్స్‌ అందుకుంది. సినిమా డిజాస్టర్‌ కావడంతో.. శ్రీనిధి ఇందులో వున్న సంగతే చాలామందికి తెలియకుండా పోయింది. కేజీఎఫ్‌ 2 పాన్‌ ఇండియా హిట్‌ అయినా.. కన్నడ ఇండస్ట్రీ శ్రీనిధిని పట్టించుకోకపోయినా.. ‘తెలుసు కదా’తో తెలుగులోకి అడుగుపెడుతోంది. ఇలా.. ఇద్దరు ఫేడౌట్‌ భామలను రొమాంటిక్‌ హీరో సిద్ధూ ఆదుకున్నాడు.