Tillu gadu : ఓవర్సీస్‌లో రికార్డు కలెక్షన్లు
సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా డీజే టిల్లు సూపర్ హిట్ సినిమాకి సీక్వెర్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్.. మార్చ్ 29న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా చేసిన ఈ సినిమా మంచి యూనానిమస్ టాక్ అందుకొని కలెక్షన్ల పరంగానూ అదరగొట్టేస్తోంది.

Siddu Jonnalagadda is the hero of DJ Tillu's super hit movie Tillu Square.
సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా డీజే టిల్లు సూపర్ హిట్ సినిమాకి సీక్వెర్ గా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్.. మార్చ్ 29న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా చేసిన ఈ సినిమా మంచి యూనానిమస్ టాక్ అందుకొని కలెక్షన్ల పరంగానూ అదరగొట్టేస్తోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోనూ సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకొని టిల్లూ గాడి సత్తా ఏంటో చాటి చెప్పింది.
ఈ సినిమాపై మొదటి నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కారణంగా యూత్ ఆడియన్స్ నుంచి ఫస్ట్ డే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా టిల్లు స్క్వేర్ సత్తా చాటడం విశేషం. మాస్ ఏరియాల్లో చాలా వరకు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. గత సినిమా అందుకున్న వసూళ్ళని యూఎస్ మార్కెట్ లో టిల్లు స్క్వేర్ ఈజీగా బద్దలు కొట్టేస్తోంది. లేటెస్ట్ గా ఓవర్సీస్ లో వసూళ్లు అయితే సిద్ధూ కెరీర్ లోనే ఒక రికార్డు ఓపెనింగ్స్ అంటున్నారు. ఈ చిత్రం కేవలం ప్రీమియర్స్ మరియు డే 1 తోనే 1 మిలియన్ డాలర్స్ మార్కుని దాటేసింది.
మరి మొదటి రోజుకే ఇలా ఉంటే వీకెండ్ కి సినిమా ఏ రేంజ్ లో అదరగొడుతుందో చూడాలంటున్నారు. కాగా టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాను ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్స్‌లో విడుదల చేశారు.. కాగా.. యూత్‌ను టార్గ్‌ట్ చేస్తూ తీసిన ఈ మూవీ తన టార్గెట్‌ను బాగానే రీచ్ అయ్యిందటున్నారు. మూవీలో టిల్లు గాడు చేసిన హంగామా, లిల్లీ తో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ప్రేక్షకులకు కావలసినంత వినోదం అందించిందంటున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ బోర్డ్ పర్ఫామెన్స్ యూత్ కి విశేషంగా కనెక్ట్ అయింది. ఏది ఏమైనా మొత్తానికి సిద్ధు ఖాతాలో మరో హిట్ పడింది.