Tillu Square: టిల్లూ జోరు.. టిల్లూ స్క్వేర్ సినిమాకు దిమ్మతిరిగే రేంజ్‌లో బిజినెస్
ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు టిల్లూ స్క్వేర్ హక్కుల కోసం ఎగబడుతున్నారట. ఇన్‌సైడ్ రిపోర్స్ ప్రకారం టిల్లూ స్క్వేర్ సినిమాకు రూ.28 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
Tillu Square: పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు సిద్దూ జొన్నలగడ్డకు డీజే టిల్లు తీసుకొచ్చింది. ఆ క్రేజ్‌ను అలానే కాపాడుకోవడానికి సిద్దూ కాస్త ఎక్కువే కష్టపడుతున్నాడు. ఎంత లేటైనా సరే టిల్లూ స్క్వేర్‌కు బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమా మార్చి 29న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ముందు నుంచి ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ట్రైలర్ రిలీజయ్యాక బిజినెస్ లెక్కలు తారుమారయ్యాయి.
PRABHAS: కల్కి, రాజాసాబ్.. ఇద్దరూ డాన్స్ చేయాల్సిందే..
ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు టిల్లూ స్క్వేర్ హక్కుల కోసం ఎగబడుతున్నారట. ఇన్‌సైడ్ రిపోర్స్ ప్రకారం టిల్లూ స్క్వేర్ సినిమాకు రూ.28 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డి.. టిల్లూ స్క్వేర్ హక్కులను కొనుగోలు చేశాడట. డిజే టిల్లు సినిమాకు అప్పుడు కేవలం రూ.9 కోట్ల బిజినెస్ జరిగింది. ఫైనల్ రన్‌లో 30 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. అయితే టిల్లూ స్క్వేర్‌కు కేవలం బిజినెస్ రూ.28 కోట్లంటే మాములు విషయం కాదు. ఇందులో నైజాం హక్కులే రూ.10 కోట్లట. ఇప్పుడున్న హైప్‌కు సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టే చాన్స్ ఉంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడు. తొలిపార్టు తీసిన విమల్ కృష్ణతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో రెండో పార్టు కోసం అద్భుతం సినిమా దర్శకుడు మల్లిక్ రామ్‌ను తీసుకొచ్చారు.
ఇక సెకండ్ పార్ట్‌కు కూడా సిద్దూనే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇక మొన్న రిలీజైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఆహా.. ఓహో.. అన్న రేంజ్‌లో లేదు కానీ.. యూత్‌కు మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ అయ్యేలా కనిపించింది. మరీ ముఖ్యంగా అనుపమతో ఘాటైన ముద్దులు, గ్లామరస్ అందాలు ట్రైలర్‌కు మిలియన్లలో వ్యూస్ తెచ్చిపెడుతున్నాయి. తొలిపార్టును ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి టిల్లూ స్క్వేర్ మొదలవుతుందని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది.