Salman Khan : ఈద్‌కి ‘సికందర్’ వస్తున్నాడు…!
స్టార్ డైరెక్టర్ (Star Director) ఏఆర్ (AR). మురుగదాస్ (Murugadoss) గురించి తెలియని సినీ లవర్ లేడు. అయితే ఇటీవల కాలంలో మురుగదాస్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.

'Sikandar' is coming for Eid...!
స్టార్ డైరెక్టర్ (Star Director) ఏఆర్ (AR). మురుగదాస్ (Murugadoss) గురించి తెలియని సినీ లవర్ లేడు. అయితే ఇటీవల కాలంలో మురుగదాస్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబుతో తెరకెక్కించిన స్పైడర్ మూవీ ఘోర పరాజయం పాలయింది. ఆ తర్వాత వచ్చిన విజయ్ సర్కార్, రజనీ దర్బార్ సినిమాలు కూడా మురుగదాస్‌ను కాపాడలేకపోయాయి. అక్కడి నుంచి మురుగదాస్‌కు హీరో దొరకడం కష్టంగా మారింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ఇప్పుడు సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తున్నాడు.
ప్రస్తుతం కోలీవుడ్ (Kollywood) హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో ఓ సినిమా చేస్తున్నాడు మురుగదాస్. నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి.. లేటెస్ట్‌గా రంజాన్ సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘సికందర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ ఈద్‌కి ‘మైదాన్’ (Maidan), ‘బడేమియా చోటేమియా’ (Bademia Chotemia) సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కానీ వచ్చే ఈద్‌కి ‘సికందర్’ మిమ్మల్ని కలుస్తాడు.. అంటూ సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఇక ఈ చిత్రానికి సల్మాన్ సన్నిహితుడు సాజిద్ నదియాద్ వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సుమారు 400 కోట్ల బడ్జెట్‍తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని తెలుస్తోంది. మరి సల్మాన్ ఖాన్‌తో మురుగదాస్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.