సింగర్ కల్పన హెల్త్ అప్ డేట్.. ఆమె ఆరోగ్యంపై డాక్టర్స్ ఏమంటున్నారంటే..?
మనం బయటికి నవ్వుతూ కనిపించినంత మాత్రాన లోపల బాధలు లేవని కాదు.. మన బాధలు బయటికి కనపడకూడదు అని మొహం మీద నవ్వు వేసుకొని తిరుగుతుంటాం అంతే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

మనం బయటికి నవ్వుతూ కనిపించినంత మాత్రాన లోపల బాధలు లేవని కాదు.. మన బాధలు బయటికి కనపడకూడదు అని మొహం మీద నవ్వు వేసుకొని తిరుగుతుంటాం అంతే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాళ్లది రంగుల ప్రపంచం కాబట్టి బయట చూసేవాళ్ళకు చాలా అందంగా కనిపిస్తుంది వాళ్ళ జీవితం. పని లోపల వాళ్లకు ఉండే బాధలు వాళ్లకు ఉంటాయి. తాజాగా ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అంత సరదాగా నవ్వుతూ ఉండే స్టేజ్ మీద జోకులు వేసే ఈమె.. సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి అంటూ షాక్ అయ్యారు అందరూ. ఎన్నో హిట్ సినిమాలో అద్భుతమైన పాటలు పాడిన కల్పన.. ఆత్మహత్యాయత్నం చేసుకుని ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్యం మీద డాక్టర్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది కల్పన. నిజాంపేట్ లో ఒక అపార్ట్మెంట్లో ఉండే కల్పన.. రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు అపార్ట్మెంట్ వాసులు. పోలీసులు వచ్చి బలవంతంగా డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే అకస్మానిక స్థితిలో ఉంది కల్పన. వెంటనే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నప్పుడు ఇంట్లో ఎవరూ లేరు.. భర్త కూడా రెండు రోజుల కింద బయటికి వెళ్లాడని చెపుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కల్పన భర్త ప్రసాద్ ను విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది.. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా.. ఎందుకు ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కేవలం గాయనిగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్, నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది కల్పన. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు భావిస్తున్నారు పోలీసులు. గతంలోనూ తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని.. సింగర్ చిత్ర ధైర్యం చెప్పడంతో ఆగిపోయానని తెలిపింది ఈమె. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. త్వరలోనే కోలుకుంటుందని అంటున్నారు. ఈ వార్త విన్న ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తనకు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత 2010లో తన భర్తతో విడిపోయానని చాలా కాలం కింద ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కల్పన. తన పిల్లలను చదివించుకునే అవకాశం లేక ఏం తోచని పరిస్థితిలో మిగిలిపోయానని తెలిపింది. మొత్తానికి ఈమె ఆత్మహత్యాయత్నం టాలీవుడ్ మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది.