కల్పన జీవితం అంతా కన్నీళ్లు.. ఎవరికీ తెలియని రహస్యాలు..
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఘటన.. టాలీవుడ్‌లో కలకలం రేపింది. అసలేమైంది.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ జోరుగా చర్చ జరిగింది. నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో ఫెయింట్ అయిపోయిన కల్పనను..

సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఘటన.. టాలీవుడ్‌లో కలకలం రేపింది. అసలేమైంది.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ జోరుగా చర్చ జరిగింది. నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో ఫెయింట్ అయిపోయిన కల్పనను.. ఇంటి తలుపులు బద్దలుగొట్టి పోలీసులు రక్షించారు. నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం నిలకడగా ఉంది. కల్పన ఆత్మహత్యయత్నంపై పోలీసులు ముందు ఆమె భర్తని అనుమానించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే కూతురితో వాగ్వాదం కారణంగానే.. కల్పన ఇలా చేశారంటూ ప్రచారం జరిగింది. ఐతే కూతురు చెప్పిన స్టేట్‌మెంట్‌తో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని.. డాక్టర్స్ సూచన మేరకు జోల్ ఫ్రెష్ మాత్రలు తీసుకుంటుందని.. వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని చెప్పుకొచ్చింది.
తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. మానసిక ఒత్తిడితో కల్పనకు సరిగా నిద్ర ఉండదని తెలిపింది. కల్పనకు మానసిక ఒత్తిడి అనే వ్యాఖ్య ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. నిజానికి కల్పన జీవితంలో ఆత్మహత్య అనే మాట మొదటిసారి కాదు. గతంలోనూ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని అనుకుందట. ఈ విషయాన్ని.. ఆమె స్వయంగా ఓ ఈవెంట్‌లో చెప్పుకొచ్చింది. అవకాశాలు లేక డిప్రెషన్‌కి లోనై.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. ఐతే సింగర్ చిత్ర.. తనను ఆ ఆలోచనల నుంచి బయటపడేసిందని చెప్పింది. కల్పనా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 30కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఐదేళ్లకే సింగర్‌గా మారిన కల్పన.. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పేరు తెచ్చుకుంది. తమిళంలో కెరియర్ మొదలుపెట్టినా.. తెలుగులోనూ మంచి గుర్తింపు లభించింది. కష్టమైన పాట పాడాలంటే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ఆమెనే ఎంచుకునేవారు.
15వేల వరకూ సినిమా పాటలు పాడింది… స్టేజీ షోలకు లెక్కే లేదు. ఐతే కల్పన వ్యక్తిగత జీవితంలో చాలా విషాదం మిగిలి ఉంది. 2010లో తన మొదటి భర్త నుంచి కల్పన విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ప్రసాద్ ప్రభాకర్ ను రెండో పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరూ ఐదేళ్లుగా కలిసే ఉంటున్నారు. ఆ మధ్య మరో వివాదం… అటూ ఇటూ తిరుగుతోంది. కొన్నాళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యే మళ్లీ కొన్ని షోలలో పార్టిసిపేట్ చేస్తోంది. తెలుగు బిగ్‌బాస్‌లోనూ కంటెస్టెంట్‌గా చేసింది. ఆమె బతుకులో విద్వత్తు ఎంతో విషాదమూ అంతే అందరితో కలివిడిగా, జోవియల్‌గా ఉండే ఆమె జీవితం పూర్తిగా తెలిసింది కొంతమందికి మాత్రమే.