పాడుతా తీయగా’లో ఎక్స్‌పోజింగ్.. బొడ్డు కిందకి చీర కట్టాలా..? సింగర్ ప్రవస్తి సంచలనం..
పాడుతా తీయగా’.. తెలుగు వాళ్లకు ఇది కేవలం ఓ పాటల కార్యక్రమం మాత్రమే కాదు.. ఒక ఎమోషన్..! ఈ షోతో ఎంతోమంది సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

పాడుతా తీయగా’.. తెలుగు వాళ్లకు ఇది కేవలం ఓ పాటల కార్యక్రమం మాత్రమే కాదు.. ఒక ఎమోషన్..! ఈ షోతో ఎంతోమంది సింగర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు టాప్‌లో ఉన్న చాలా మంది గాయకులు పుట్టింది ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలోనే. లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా 1996లో ఈటీవీలో మొదలైంది ‘పాడుతా తీయగా’ షో. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ షోకు ఉన్న గుర్తింపు ఇంత కూడా తగ్గలేదు. బాలు లేకపోయినా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఈ షోని ఇప్పుడు రన్ చేస్తున్నారు. తాజాగా ఈ షో సిల్వర్ జూబ్లీ వేడుకలు మొదలయ్యాయి. ఈ సిరీస్‌కి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లెవ్వరూ లేరు.. కానీ తాజాగా సింగర్ ప్రవస్తి ఈ షో మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యే ‘పాడుతా తీయగా’ నుంచి ఎలిమినేట్ అయింది ప్రవస్తి. ఈమె చాలా మంది గాయని.. ఇప్పటికే చాలా సింగిల్ షోలు గెలిచింది కూడా.
గతంలో సూపర్ సింగర్‌తో పాటు చాలా షోలలో పాల్గొన్న ప్రవస్తి.. అన్నిచోట్లా మంచి ప్రదర్శనలే ఇచ్చింది. 2017లో బాలసుబ్రమణ్యం ఉన్నపుడే పాడుతా తీయగా షోకు వచ్చి అప్పుడు కూడా మంచి ప్రదర్శన ఇచ్చింది ప్రవస్తి. ఆయనున్నపుడు షో చాలా బాగుందని.. కానీ ఇప్పుడు పూర్తిగా దారి తప్పిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఎలిమినేట్ అయిన వెంటనే.. ఇన్‌స్టాలో వరస పోస్టులు పెట్టింది ప్రవస్తి. పాడుతా తీయగా ప్రోగ్రామ్‌కి వెళ్లాలనుకుంటున్న సింగర్స్‌కు తన సలహా ఒక్కటే అని.. ఏమైనా రికమండేషన్స్ లేదంటే జడ్జీల నుంచి రిఫరెన్స్‌లు ఉంటే తప్ప ఈ షోకు వెళ్లకండి అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి. ఆ రెండూ లేకుండా వెళ్తే మీకు అన్యాయం, మానసిక వేదన మాత్రమ తప్ప ఇంకేం మిగిలవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మొత్తం 22 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది ప్రవస్తి. ‘పాడుతా తీయగా’లో చాలా దారుణాలు జరుగుతున్నాయని.. కానీ వాటిని బయటకి చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదంటూ చెప్పింది ఈమె. తన మ్యూజికల్ కెరీర్ ముగిసిపోయిందని డిసైడ్ అయిన తర్వాతే ఈ పోస్ట్ పెడుతున్నానని చెప్పింది ప్రవస్తి. ఈ పోస్టు పెట్టిన తర్వాత ఎలాగూ తనకు అవకాశాలు రావు.. రానివ్వరు కూడా..!
సంగీత ప్రపంచం వదిలేయాలని ఫిక్సైన తర్వాతే తను ‘పాడుతా తీయగా’లో జరుగుతున్న దారుణాలను బయటపెడుతున్నట్లు తెలిపింది ప్రవస్తి. బాలు గారు ఉన్నపుడు షో చాలా బాగుందని.. కానీ ఇప్పుడలా కాదు అంటూ తెలిపింది ఈమె. ఈ షోలో జడ్జిలు తనను ఓ చీడపురుగులా చూసేవాళ్ళని పేర్కొంది. అంతేకాదు తన బాడీ మీద కూడా జోక్స్ వేశారని.. బాడీ షేమింగ్ చేసారని చెప్పింది. తమిళంలో కూడా తాను షోలు చేసానని.. కానీ ఎక్కడా ఇలా చూడలేదని చెప్పింది ఈమె. అంతేకాదు అప్పట్లో డబ్బులు టైట్ ఉండి పెళ్లిలో పాటలు పాడానని.. కానీ దాన్ని కూడా కీరవాణి చిన్నచూపు చూసాడని చెప్పుకొచ్చింది ప్రవస్తి. పెళ్లిలో పాటలు పాడుకునేవాళ్లు తన దృష్టిలో సింగర్స్ కాదని అన్నట్లు గుర్తు చేసుకుంది ఈమె. ఇక ప్రొడక్షన్ వాళ్ళు మరీ దారుణంగా ఉంటారని.. తనను చాలా తిట్టేవాళ్లని.. ఎక్స్ పోజింగ్ చేయమనేవాళ్లని.. చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకోమనేవాళ్లు అంటూ తనకు షోలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుంది ప్రవస్తి. సింగర్ సునీత, చంద్రబోస్ కూడా తక్కువేం కాదంటుంది ప్రవస్తి. చంద్రబోస్ ముందు కాస్త బాగానే ఉండేవాడని.. కానీ ఆ తర్వాత ఆయన కూడా అలాగే మారిపోయాడంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేసింది ప్రవస్తి. ప్రస్తుతం ఈమె కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.