Siri Hanumanthu: జబర్దస్త్ కొత్త యాంకర్‌గా సిరి హన్మంతు.. సౌమ్యను ఎందుకు తప్పించారు..?

రష్మి, సౌమ్యారావు షోను నడిపిస్తున్నప్పటికి కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. యాంకర్ మంజూష అని కొంత మంది.. బిగ్ బాస్ స్రవంతి అని ఇంకొందరు ఇలా.. అనేక ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు రష్మీ, సౌమ్యారావు తప్పుకోవడంతో అర్జెంటుగా కొత్త యాంకర్‌ను పట్టేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2023 | 02:10 PMLast Updated on: Nov 06, 2023 | 2:10 PM

Siri Hanmanth As New Anchor For Jabardasth Telecasts On 9th November

Siri Hanumanthu: జబర్దస్త్.. తెలుగు వారిలో ఈ పేరు తెలియనివారుండరు. బుల్లితెరపై రికార్డ్ సృష్టించిన కామెడీ షో. అలాంటి కామెడీ షోలో అందాలు అరబోస్తూ తెగ రచ్చ చేశారు యాంకర్లు అనసూయ, రష్మి. తాజాగా ఈ ముద్దుగుమ్మలు సినిమాలతో బిజీగా మారడంతో ఈ షోకి వీడ్కోలు పలికారు. గతంలో రష్మి స్థానంలో కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉండగా ఎట్టకేలకు సౌమ్యా రావు అనే కొత్త యాంకర్ తెరమీదకు వచ్చింది. ఇప్పుడు మరో యాంకర్ రావడం హాట్ టాపిక్‌గా మారింది.

రష్మి, సౌమ్యారావు షోను నడిపిస్తున్నప్పటికి కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. యాంకర్ మంజూష అని కొంత మంది.. బిగ్ బాస్ స్రవంతి అని ఇంకొందరు ఇలా.. అనేక ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు రష్మీ, సౌమ్యారావు తప్పుకోవడంతో అర్జెంటుగా కొత్త యాంకర్‌ను పట్టేశారు. బిగ్‌బాస్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లు, సీరియల్స్‌లో నటించిన సిరి హన్మంతును కొత్త యాంకర్‌గా తీసుకువచ్చారు. బిగ్‌బాస్ తర్వాత పలు షోల్లో కనిపించిన ఈ బ్యూటీ.. జవాన్ సినిమాలోనూ మెరిసింది. తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు యాంకరింగ్ చేయబోతున్నట్లుగా ఈరోజు విడుదలైన ప్రోమోలో తెలుస్తోంది. సౌమ్యరావు ప్లేస్‌లో కొత్త యాంకర్‌గా సిరి హన్మంత్‌ని తీసుకువచ్చారు.

అయితే సిరి.. సౌమ్య ప్లేస్‌లో ఎందుకు వచ్చింది.. సౌమ్య ఎందుకు మానేసింది.. అనే విషయాలు మాత్రం తెలీవు. కానీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సిరిని దింపేశారు. ఈ షోతో సిరి తనెంటో ప్రూవ్ చేసుకుంటుందా.. మరిన్ని అవకాశాలు వచ్చే విధంగా యాంకరింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.