భర్త కోసం స్నేహా రెడ్డి సంచలన నిర్ణయం, తిరుపతి నుంచి ప్రముఖులు
సినిమాలు వ్యాపారాలు అంటూ ఎంతో బిజీగా ఉండే అల్లు కుటుంబంలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం... వారికి ఒక రకంగా ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండానే చేసింది.
సినిమాలు వ్యాపారాలు అంటూ ఎంతో బిజీగా ఉండే అల్లు కుటుంబంలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం… వారికి ఒక రకంగా ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండానే చేసింది. సంధ్య థియేటర్ లో పుష్ప ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ వెళ్ళటం… ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా ఆ కుటుంబానికి ఒక రకంగా ఇబ్బందికరంగానే మారాయి. ఈ స్థాయిలో అల్లు అర్జున్ కుటుంబం ఎప్పుడూ కూడా మీడియాలో లేదనే చెప్పాలి. కేవలం సినిమాల పరంగానో లేకపోతే వ్యాపారాలు పరంగానో ఆ కుటుంబం వార్తల్లో ఉండేది.
ఇక అల్లు అర్జున్ జీవితంలోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడు ఏ పరిణామం చోటు చేసుకుంటుందో అర్థం కాక ఒక రకంగా మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నట్లుగానే వాతావరణం కనబడుతోంది. శనివారం సాయంత్రం అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండానే మాట్లాడాడు. అల్లు అర్జున్ పూర్తిగా ఒత్తిడి లోనే ఉన్నాడు అని క్లారిటీ చాలామందికి వచ్చింది. ఇక అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా ప్రస్తుతం ఈ ప్రెజర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది.
దీనితో ఇప్పుడు తన భర్త ఈ కేసు నుంచి బయటకు రావాలని ఆమె పూజలు కూడా చేయడం మొదలుపెట్టారు. త్వరలోనే తన ఇంట్లో ఒక హోమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ జ్యోతిష్యులతో కూడా ఆమె మాట్లాడి హోమం చేయిస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారని… అల్లు కుటుంబం మొత్తం ఈ హోమంలో పాల్గొనాలని ఆమె కోరారట. జనవరి పదిలోపు ఈ హోమం నిర్వహించాలని అల్లు స్నేహారెడ్డి భావిస్తున్నారట. పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత తమ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోవడం… నేషనల్ లెవెల్ లో ఫేం వచ్చిన సరే అల్లు అర్జున్ సామాన్య ప్రజల్లో ఒక దోషిగా మిగిలిపోవటం ఇవన్నీ కూడా ఆ కుటుంబాన్ని ఆందోళన గురి చేస్తున్నాయట.
అందుకే ఇప్పుడు స్నేహ రెడ్డి హోమం చేయించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రముఖ జ్యోతిష్యుడుతో కూడా ఆమె చర్చలు జరిపారు. ఈ మేరకు తిరుపతి నుంచి కొంతమంది వేద పండితులు కూడా ఈ హోమాన్ని నిర్వహించేందుకు వెళ్లానున్నారు. అలాగే తమిళనాడు నుంచి ఒక ప్రముఖ వేద పండితుడిని కూడా ఆహ్వానించారు. తాజాగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారణ కూడా పిలిచిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం సాయంత్రం అల్లు అర్జున్ ఇంటి వద్ద కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు అడిగే ప్రశ్నలపై ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనే దానిపై అల్లు అర్జున్ లాయర్లతో చర్చించాడు. అయితే అల్లు అర్జున్ తో పాటుగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లే అవకాశం కనబడుతోంది.