ఇంత లేటా..? అమెరికా వెళ్ళిపోయిన ప్రియాంక చోప్రా..? రీజన్ అదే..?
దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించడం అంటే దాదాపు రెండు మూడేళ్ల పాటు మరో సినిమాకు సైన్ చేయకుండా ఉండటం.
దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించడం అంటే దాదాపు రెండు మూడేళ్ల పాటు మరో సినిమాకు సైన్ చేయకుండా ఉండటం. ఈ విషయంలో చాలామంది హీరోయిన్లతో పాటు హీరోలు కూడా భయపడుతూ ఉంటారు. చాలామంది హీరోలు రాజమౌళితో సినిమా అనగానే అమ్మో ఐదేళ్లపాటు తమ కెరీర్ ను ఫణంగా పెట్టాలని వర్రీ అవుతూ ఉంటారు. చిన్న సినిమాలు కూడా ఎక్కువ టైం తీసుకునే రాజమౌళితో సినిమా అనగానే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్కువగా కంగారుపడుతున్నారు.
దాదాపు మహేష్ కెరీర్ లో నాలుగు నుంచి ఐదు ఏళ్ల పాటు రాజమౌళికే కేటాయించాల్సి ఉంటుంది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలాగే రాజమౌళి సినిమాల కోసం తమ కెరీర్ లో ఎక్కువ టైం కేటాయించారు. ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇప్పుడు ఆ హీరోలు నానా కష్టాలు పడుతున్నారు. ఇక ప్రభాస్ అయితే ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే అప్పట్లో అనుష్క రాజమౌళితో సినిమా కోసం చాలా కష్టపడింది. బాహుబలి రెండు సినిమాలు కోసం రాజమౌళి ఆమెను తీసుకోవడంతో మరో సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే ఎక్కువగా వర్క్ చేసింది.
ఇప్పుడు ప్రియాంక చోప్రా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రియాంక చోప్రా బాజీరావు మస్తానీ సినిమా తర్వాత నుంచి ఎక్కువగా హాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ సినిమాలను కూడా చాలా తక్కువగా చేస్తున్న ప్రియాంక చోప్రా అసలు ప్రాంతీయ భాషల వైపు చూసే ప్రయత్నం చేయలేదు. కానీ రాజమౌళి సినిమా కాబట్టి ఆమె ఓకే చేసింది. హాలీవుడ్ రేంజ్ కాబట్టి మరో మాట లేకుండా ఈ సినిమాను ఫైనల్ చేసుకుంది.
దాదాపు రెండేళ్ల పాటు రాజమౌళి టైం అడగడంతో అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం దాదాపు 30 కోట్లకు పైగా డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ షూటింగ్లో ప్రియాంక చోప్రా కు అవకాశం లేకపోవడంతో ఆమె అమెరికా వెళ్లే అవకాశం ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆమె సోదరుడు సిద్ధార్థ చోప్రా వివాహం కోసం ముంబై వెళ్తూ ఆమె హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఇక ప్రియాంక చోప్రా లేకపోయినా సినిమా షూటింగ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. షెడ్యూల్ కంటిన్యూ చేస్తూ రాజమౌళి.. మహేష్ బాబుతో కొన్ని సీన్స్ ను ప్లాన్ చేశాడు. ప్రియాంక చోప్రా త్వరలో తిరిగి షూటింగ్లో జాయిన్ అవుతుందని టాక్. అయితే ఈ సమయంలో హాలీవుడ్ సినిమా ఒకటి కొంత షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉండటంతో ఆమె అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. తన బ్రదర్ పెళ్లి తర్వాత ఆమె డైరెక్ట్ గా ముంబై నుంచి అమెరికా వెళ్లి మరో నెల రోజుల తర్వాత తిరిగి డైరెక్ట్ గా కెన్యా వెళ్లే ఛాన్స్ ఉందని టాక్.