అలా చేయడానికి నేను సమంతను కాదు శోభిత షాకింగ్ కామెంట్స్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద మంచి గ్రిప్ ఉన్న కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. ఆ ఇంటికి కోడలిగా వెళ్లాలంటే అదృష్టంతో పాటు బాధ్యతలు కూడా మోయాలి. ఎందుకంటే ఫ్యామిలీ లెగసీని కాపాడాల్సిన బాధ్యత ఇంటి కోడలి మీద కూడా ఉంటుంది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారికైతే ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని తాను చాలా పర్‌ఫెక్ట్‌గా అర్థం చేసుకున్నానని చెప్తోంది శోభిత దూళిపాళ. త్వరలోనే ఈ అమ్మడు అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతోంది. ఆగస్ట్ 8న నాగచైతన్యతో శోభిత ఎంగేజ్‌మెంట్ జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ తరుణంలో శోభిత ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా కొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తోంది శోభిత. ఇదే క్రమంలో రణ్‌వీర్ సింగ్ సినిమాలో ఓ ఐటం సాంగ్ చేసేందుకు వచ్చిన ఆఫర్‌ను శోభిత రిజెక్ట్ చేసిందట. ఎందకంటే ఐటం సాంగ్స్ చేసి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ప్రతిష్టను దెబ్బతీయడం తనకు ఇష్టం లేదట. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు.. తాను ఇప్పుడు అక్కినేని కుటుంబంలో కోడలిని కాబట్టి తన కెరీర్‌తో పాటు తన అత్తింటి పరువును కూడా దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్ట్‌లు టేకోవర్ చేస్తానని చెప్పిందట శోభిత. ఈ కారణంగానే ఐటం సాంగ్ చేసేందుకు వచ్చిన ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేసిందట. సినిమాలో వేరే ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఓకే కానీ ఐటం సాంగ్ మాత్రం చేయని మొహం మీదేచెప్పేసిందట. శోభిత తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ వల్లే చైతన్య తన మాజీ భార్య సమంతకు దూరమయ్యాడే రూమర్స్ ఉన్నాయి. పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చైతన్య వద్దు అన్నా కూడా సామ్ చేసిందని.. అలా చేసినందుకే వాళ్ల మధ్య గ్యాప్ వచ్చింది అనే రూమర్స్ చాలా ఉన్నాయి. ఆ ఒక్క పనే వాళ్లను విడదీసింది కాబట్టి ప్రాణం పోయినా సమంత చేసిన తప్పు తాను చేయొద్దని శోభిత డిసైడనట్టు తెలుస్తోంది. సామ్ చేసిన ఆ తప్పు తాను చేయనని.. ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాలన్నా చైతన్యతో మాట్లాడిన తరువాతే చెప్తానని అంటోంది.