చైతూకు శోభిత స్పెషల్ గిఫ్ట్, ముంబైలో చైతూ కోసం సూపర్ ప్లానింగ్
నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఊపేస్తోంది. ఈ వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ ను ఏర్పాటు చేశారు.
నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఊపేస్తోంది. ఈ వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. ఇక అతి తక్కువ మంది అతిధులతో ఈ వివాహ వేడుకను అక్కినేని ఫ్యామిలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం 300 మంది అతిథులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా కొంతమంది వివాహ వేడుకకు హాజరవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక శోభిత, నాగచైతన్య వివాహం తర్వాత దాదాపు 3 నెలల పాటు యూరప్ లోనే ఉండనున్నారట.
నాగార్జున క్లోజ్ ఫ్రెండ్ ఒకరికి యూరప్ లో సొంత ఇల్లు ఉండటంతో వీళ్ళిద్దరూ అక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నట్లు అక్కినేని ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారట. ఈ వివాహ కార్యక్రమానికి రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇక పెళ్లికి ఇచ్చే గిఫ్ట్ లపై సోషల్ మీడియాలో అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. నాగచైతన్యకు శోభిత కుటుంబం భారీగా కానుకలు ఇస్తున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ లో ఒక ప్రముఖ ఏరియాలో లగ్జరీ విల్లాను నాగచైతన్య కోసం కొనుగోలు చేసారు.
అలాగే ఆడి కార్ ఒక స్పోర్ట్స్ బైక్ను కూడా అల్లుడికి గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. ముంబైలో కూడా శోభిత నాగచైతన్యకు ఓ భారీ గిఫ్ట్ ఇస్తుందట. తాను బాలీవుడ్ లో కష్టపడి సంపాదించిన వాటితో ముంబైలో జూహు ఏరియాలో ఫ్లాట్ ను కొనుగోలు చేసింది శోభిత. ఆ ఫ్లాట్ ను నాగచైతన్య గిఫ్ట్ గా ఇవ్వడానికి రెడీ అయింది. వివాహం తర్వాత కొన్నాళ్ళు ముంబైలోనే ఉండాలని ఇద్దరు భావిస్తున్నట్లుగా సమాచారం. శోభితకు బాలీవుడ్ లో కమిట్మెంట్ లు ఉండటంతో నాగచైతన్య కూడా కొన్నాళ్లు ఆమెతో పాటే ఉండడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
మరోవైపు వివాహం తర్వాత కొన్నాళ్లు చైతన్య సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అటు నాగార్జున కూడా శోభితకు భారీ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. టయోటా లెక్సస్ కారును ఆమె కోసం కొనుగోలు చేశారు నాగార్జున. దీనికి ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది.