Top story: ముసలి వయసులో … ముతక స్టెప్పులు బరితెగించిన బాలయ్య

ఆయన వయసు 65 ఏళ్లు. పదేళ్ల క్రితమే తాతయ్యేడు. ఏదో ఇన్నాళ్లు ఎన్టీఆర్ బ్రాండ్ తో సినిమాల్లో నెట్టుకొచ్చాడు. మూడుసార్లు ఎమ్మెల్యే. ప్రజా ప్రతినిధి. అవన్నీ గాలికి వదిలేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2025 | 04:57 PMLast Updated on: Jan 07, 2025 | 4:57 PM

Social Media Fans Fire On Balakrishna Steps

ఆయన వయసు 65 ఏళ్లు. పదేళ్ల క్రితమే తాతయ్యేడు. ఏదో ఇన్నాళ్లు ఎన్టీఆర్ బ్రాండ్ తో సినిమాల్లో నెట్టుకొచ్చాడు. మూడుసార్లు ఎమ్మెల్యే. ప్రజా ప్రతినిధి. అవన్నీ గాలికి వదిలేసాడు. దబిడి దిబిడే అంటూ ఐటమ్ గర్ల్ వెనక పడుతూ… ఆయన వేసిన రోత స్టెప్పులు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారి తీసేయ్. నీ ఏజ్ ఏంటి? నీ గేజ్ ఏంటి? ఇద్దరు ఆడపిల్లలు తండ్రివి. వయసు కూడా దాటిపోయింది. అసలు ఆ రోత మాటలు…. మతక స్టెప్పులు నీకు ఇప్పుడు అవసరమా? అంటూ జనం సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఆయనే నందమూరి బాలకృష్ణ. పండక్కి వస్తున్న డాకు మహారాజ్ మూవీలో నటి ఊర్వశి రౌతాలతో కలిసి అసహ్యకరమైన, జుగుప్సాకరమైన స్టెప్పులు ఇప్పుడు ఆయన కెరీర్నే డ్యామేజ్ చేసేటట్టు ఉన్నాయి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అనుకునే రకం కాబట్టి బాలయ్య పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

కానీ ఆయన ఫ్యాన్సు, ఫ్యామిలీ మెంబర్స్ నీ మాత్రం బాలయ్య స్టెప్పులు అగౌరపరిచేలా ఉన్నాయి. హీరోయిన్ ఊర్వశి రవుతాలా మొత్తపై వెనుక నుంచి బాధడం, ఆపై చెప్పుకోలేని చోట చేయి పెట్టి గుంజడం చూస్తే బాలయ్య ఎంతగా దిగజారిపోయాడో అర్థమవుతుంది. ఐటంసాంగ్‌ అన్న పేరేగానీ.. దబిడి దిబిడే పాట వినడానికి బాగుంది. మ్యూజిక్‌ బాగుంది. కానీ ఆ ఒక్కటీ బాగోలేదు. డాకు మహారాజ్ అంచనాలను ఒక్కసారిగా కూల్చేసింది. ఆ ఒక్క స్టెప్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేసుకుందా? తప్పు ఎవరిది? జుగుప్స కలిగించేలా స్టెప్‌ కంపోజ్‌ చేసిన కొరియోగ్రాఫర్‌దా? లేదంటే.. అందులో నటించిన హీరోదా? పట్టించుకోని దర్శకుడిదా? సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నా.. హ్యాట్రిక్‌ హిట్‌తో దూసుకుపోతున్న బాలకృష్ణ ‘డాకూ మహారాజ్‌’పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వచ్చిన మూడు గ్లిమ్స్‌.. రెండు పాటలు ముఖ్యంగా ‘చిన్ని..’ అంటూ సాగే చైల్డ్‌ సెంటిమెంట్‌ సాంగే సినిమాకు హైప్‌ తీసుకొచ్చింది. డాకు యాక్షన్‌ మూవీనే కాదు.. ఫ్యామిలీ సెంటిమెంట్‌ మూవీ అన్న ఇంప్రెషన్‌ ఇచ్చింది. ఇంతలో వచ్చిన ‘దబిడి దిబిడి..’ సాంగ్‌లో బాలకృష్ణ వేసిన స్టెప్‌ ‘డాకూ మహారాజ్‌’ భయంకరమైన ట్రోలింగ్‌కు గురైంది.

బాలకృష్ణ పంచ్‌ డైలాగ్‌ ‘దబిడి దిబిడే’నే సాంగ్‌గా రాశాడు కాసర్ల శ్యామ్‌. బాలకృష్ణ సినిమాల్లో హైలైట్‌గా నిలిచిన పంచ్‌ డైలాగ్స్‌ను రొమాంటిక్‌గా మార్చాడు. దబిడి దిబిడి అన్న పదానికి న్యాయం చేయడానికే ఇలా చేశావా? నీ వయసేంటి.. ఈ పనులేంటి అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 65 ప్లస్‌లో హుందాగా వుండాల్సిన హీరో హీరోయిన్‌తో వేసే స్టెప్పులేనా? అంటూ దుయ్యపడుతున్నారు.ఊర్వశి రౌతేల వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్‌నుంచి స్కంద వరకు ఐటంసాంగ్స్ చేసింది. మంచి డ్యాన్సర్‌గా పేరుతెచ్చుకుంది. దబిడి దిబిడిలో బాలయ్య స్టెప్పే కాదు.. ఈ అమ్మడి డ్యాన్స్‌ మూమెంట్‌ కూడా చూడలేకపోతున్నామంటున్నారు జనం. బాలకృష్ణ డైరెక్టర్స్‌ హీరో. దర్శకుడు ఏది చెబితే అది చేసేస్తాడు. ఇది చాలామందికి తెలిసిన విషయం కావడంతో.. మరికొందరు నెటిజన్లు.. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ను టార్గెట్‌ చేశారు. ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. నువ్వు చేయాలనుకున్న స్టెప్‌ బాలయ్యపై రుద్దావా? అంటూ కౌంటర్‌ ఇచ్చారు. బాలయ్య ఒక్క హీరోనే కాదు.. మూడోసారి ఎమ్మెల్యే. ఒక ప్రజా ప్రతినిధి. మరోవైపు బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఛైర్మన్‌. ఇలాంటి హీరోగా నీచమైన స్టెప్‌ వేయించి పరువు తీశావంటూ.. బాలయ్య అభిమానులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వికృతమైన స్టెప్‌ దబిడి దిబిడే అంటూ గుండెల్లో బలంగా గుద్దినట్టుగా వుందని ఫ్యాన్సే ఫీలవుతున్నారు. మరి సోషల్‌మీడియాలో ఇంతగా ట్రోల్‌ అవుతున్న దబిడి దిబిడి సాంగ్‌ సినిమాలో వుంటుందా? లేదంటే.. తీసేసి రిలీజ్ చేస్తారో చూడాలి మరి. కొరియోగ్రాఫర్ ఉత్సాహపడి ఉండొచ్చు, డైరెక్టర్ రెచ్చగొట్టి ఉండొచ్చు కానీ 65 ఏళ్ల బాలకృష్ణ ఉచితనిచితాలు మర్చిపోయి వికారమైన స్టెప్పులు ఇస్తే దీన్ని బరితెగింపు కాకుండా ఇంకా ఏమంటారు. ఈ పెద్ద మనిషి రేపు అసెంబ్లీలో కూర్చుని అది ప్రొఫెషన్, ఇది ప్రజాసేవ దేని దారి దానిదే అని సూక్తులు చెప్తాడేమో.