ఈ రోజుల్లో సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తూ ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెడుతూ కొంతమంది చేస్తున్న బిహేవియర్ చూసి సమాజం భయపడే పరిస్థితి క్రియేట్ అవుతోంది. స్టార్ హీరోయిన్లను టార్గెట్ గా చేసుకొని కొందరు చేస్తున్న రచ్చ అంతా కాదు. పదేపదే హీరోయిన్లను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు కొందరు. రీసెంట్ గా మలయాళం స్టార్ హీరోయిన్ హనీ రోజ్ ఒక వింత పరిస్థితి ఎదుర్కొన్నది. తన పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నాడు ఒక వ్యక్తి అంటూ ఆమె పోలీసులకు సంచలన ఫిర్యాదు చేసింది. ఎక్కడబడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడని రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తాను ఈ వేధింపులను ఎందుకు సహించాలి అని ప్రశ్నించింది. తనతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్ కు సంబంధించిన ఈవెంట్లకు వెళుతూ ఉండేవారని... నన్నే టార్గెట్ చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతడు తన ఇంటర్వ్యూలలో కూడా నన్నే టార్గెట్ చేస్తున్నాడని ప్రతిసారి తన పేరే వాడుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇక హనీ రోజ్ కంప్లైంట్ తో ఆమెను వేధిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పోలీసులను ఆశ్రయించింది. ఈమెకు కూడా సోషల్ హ్యాండిల్స లో నరకం స్పెల్లింగ్ రాయిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపుతున్నాడని ఆ వ్యక్తి తనతో పాటు తనకి ఇష్టమైన వారిని కూడా టార్గెట్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో రాసుకొచ్చింది. ఆ వ్యక్తి బెదిరింపులు వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని... నిందితుడి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజ సాబ్ అనే సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ తెలుగులో ఈ మధ్యనే కాస్త ఫేమస్ అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. ఇలాంటి టైంలో ఈమెను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం కాస్త సెన్సేషన్ అవుతుంది. ఏది ఏమైనా హీరోయిన్లను ఇలా వరుసగా టార్గెట్ చేయడం మాత్రం కాస్త సినిమా వాళ్ళు కూడా భయపడే వాతావరణం క్రియేట్ అవుతుంది. మరి దీనిపై పోలీసులు ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాలి.[embed]https://www.youtube.com/watch?v=xezPFhm13E0[/embed]