పుష్పని ఆడుకుంటున్నారా..? అవన్నీ అబద్దాలేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప2 చూసేందుకొచ్చి భార్యని కోల్పోయిన ఓ వ్యక్తికి, 25 లక్షల పరిహరం ప్రకటించాడు బన్నీ. నిజానికి హాస్పిటల్ లో ఉన్న అబ్బాయి ఖర్చులన్నీ తామే భరిస్తామని పుష్ప2 టీం ప్రకటించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప2 చూసేందుకొచ్చి భార్యని కోల్పోయిన ఓ వ్యక్తికి, 25 లక్షల పరిహరం ప్రకటించాడు బన్నీ. నిజానికి హాస్పిటల్ లో ఉన్న అబ్బాయి ఖర్చులన్నీ తామే భరిస్తామని పుష్ప2 టీం ప్రకటించింది. బన్నీనే ఆ మాట వీడియో బైట్ లోచెప్పాడు.. నిజానికి ఇది మెచ్చుకోవాల్సిన అంశమే.. కాని ఇది భారీగా ట్రోలింగ్ కి కారణమైంది. అసలు ఎక్స్ గ్రేషియా ప్రకటించకున్నా, ఇంతగా ట్రోలింగ్ జరిగేది కాదేమో. కాని బన్నీ ఇచ్చిన స్టేట్ మెంట్లను పార్టులు పార్టులుగా విడగొట్టి, ట్రోలింగ్ తో పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు ట్రోలర్స్.. బన్నీ చెప్పేవన్నీ అబద్దాలే అంటున్నారు.. అంతగా ఆ వీడియో ఎందుకు ట్రోలింగ్ కి గురైందోచూసేయండి.
పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు జనాల తోపులాటలో 39 ఏళ్ల గ్రుహిని మరణించటం, తన కొడుకు హాస్పిటల్ లో క్రిటికల్ స్టేజ్ లో ఉండటం లాంటి న్యూస్ వైరలైంది. ఐతే బన్నీ కూడా స్పందించిన ఆ ఫ్యామిలీకి 25 లక్షలు ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చాడు. ఆ ఫ్యామిలీకి తామున్నామనే భరోసా ఇచ్చాడు..
కట్ చేస్తే ఇదే ఇప్పడుు వివాదంగా మారుతోంది. ఇలా పుష్ప2 రిలీజ్ టైంలో అపశ్రుతి చోటు చేసుకోవటం వల్లే తాము, ఈ మూవీ హిట్ ని సెలబ్రేట్ చేసుకోలేదన్న తన మాటని ట్రోల్ చేస్తున్నారు
ఎందుకంటే పుష్ప2 సెలబ్రేషన్స్ గట్టిగానే ఫిల్మ్ టీం చేసుకున్నా, అలా ఏం చేసుకోలేదని బన్నీ అనటమే కాదు, ఇన్సిడెంట్ జరిగాక చాలా లేట్ గా బన్నీ స్పందించాడంటూ ట్రోలింగ్స్ పెంచారు. ఆల్రెడీ యాంటీ ఫ్యాన్స్ తో బన్నీ మూవీ పుష్ప2 కి సినిమా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో తను విక్టిమ్స్ కి పాతిక లక్షల సాయం చేసినా అది కూడా వివాదంగా మారుతోంది
అంతేకాదు, బన్నీ అసలు సారినే చెప్పలేదనే మాటే తూటాలా పేలుతోంది. తన మూవీ వల్ల ఓ నిండు ప్రాణం పోతే, పాతిక లక్షలతో సపోర్ట్ చేస్తాననటమేంటని, కనీసం సారి కూడా చెప్పడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే థియేటర్స్ కి వస్తున్నట్టు ముందుగా చెప్పకపోవటం వల్ల, తను సడన్ గా రావటంవల్లే తొక్కిసలాట జరిగి, ఇలా అయ్యిందనేది ట్రోలర్స్ వర్షన్.. ఏదేమైనా ఇలా కూడా అల్లు అర్జున్ మాటలు ట్రోలింగ్ కి గురయ్యాయి.