నాగార్జునను ఘోరంగా అవమానించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. ఆయన హోస్ట్ అయితే నేను వెళ్లను..!

బిగ్ బాస్ అంటే నాగార్జున తప్ప మరొకరు గుర్తురారు. అంతగా ఆయన ఆడియన్స్‌కు అలవాటు అయిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్, నాని తర్వాత ఈ హోస్ట్ బాధ్యతలు తీసుకున్న నాగ్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 07:00 PMLast Updated on: Mar 26, 2025 | 7:00 PM

Soinya Akula Sensational Comments On Nagarjuna

బిగ్ బాస్ అంటే నాగార్జున తప్ప మరొకరు గుర్తురారు. అంతగా ఆయన ఆడియన్స్‌కు అలవాటు అయిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్, నాని తర్వాత ఈ హోస్ట్ బాధ్యతలు తీసుకున్న నాగ్.. గత 6 సీజన్స్‌గా దుమ్ము దులిపేస్తున్నాడు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా ఉతికి ఆరేస్తున్నాడు. నాగార్జున హోస్టింగ్ గురించి బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పొగుడుతూనే ఉంటారు కంటెస్టెంట్స్. అలాంటిది ఒక్క హీరోయిన్ మాత్రం నాగార్జునను దారుణంగా అవమానించింది. అసలు బిగ్ బాస్ షోకు నాగార్జున సెట్ కారని చెప్పింది. ఆయన కంటే రానా దగ్గుబాటి అయితే బాగుంటాడంటూ కామెంట్ చేసింది. ఆమెవరో కాదు.. సోనియా ఆకుల. బిగ్ బాస్ గత సీజన్‌లో ఈమెకు వచ్చినంత నెగిటివిటీ మరెవరికీ రాలేదేమో..?

జార్జి రెడ్డితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించింది సోనియా. దిశా ఘటనపై వర్మ తెరకెక్కించిన ఆశ ఎన్‌కౌంటర్ సినిమాలో సోనియానే నటించింది. అయితే ఈమెకు నటిగా వచ్చిన గుర్తింపు కంటే.. బిగ్ బాస్ షోకు వచ్చాక వచ్చిన గుర్తింపే ఎక్కువ. తక్కువ రోజులే అక్కడున్నా.. అమ్మడికి ఫేమ్ మాత్రం బాగానే వచ్చింది. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆమె ఆ షోను పొగడలేదు సరికదా తనకు అంత గుర్తింపు తీసుకొచ్చిన షోపై విమర్శల వర్షం కురిపించింది. తన ఇమేజ్ పోగొట్టడానికే బిగ్ బాస్ ప్రయత్నించిందని.. అనవసరంగా ఆ షోకు వెళ్లి ఉన్న ఇమేజ్ కూడా పోయిందని చెప్పుకొచ్చింది సోనియా. గత సీజన్‌లో కేవలం 28వ రోజే సోనియా ఆకుల ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ఇస్మార్ట్ జోడి సీజన్ 3 లోను కంటెస్టెంట్‌గా కంటిన్యూ అయింది. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై బాగానే బిజీ అయింది సోనియా. ఈ మధ్యే పెళ్లి కూడా చేసుకుని పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.

ఈ మధ్యే ఆర్టిస్ట్ అనే సినిమాలో నటించింది సోనియా. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే బిగ్ బాస్ షో గురించి కూడా ఓపెన్ అయింది సోనియా ఆకుల. బిగ్ బాస్ 9 షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తే వెళ్తారా అని అడిగితే.. నాగార్జున సార్ హోస్ట్‌గా ఉంటే మాత్రం తను వెళ్లనంటూ చెప్పుకొచ్చింది. కొన్ని విషయాల్లో నాగార్జున సార్ డెసిషన్స్ భిన్నంగా ఉంటున్నాయని.. గత సీజన్‌లో గౌతమ్‌ది ఏం తప్పు లేకున్నా కూడా షట్ అప్ అంటూ గట్టిగా అరిచేసాడని గుర్తు చేసింది ఈ బ్యూటీ. నాగ్ సార్ చాలా సాఫ్ట్ పర్సన్ అని.. సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేయడంలో ఆయన తడబడతారంటూ చెప్పుకొచ్చింది. కంటెస్టెంట్‌లకు కూడా ఆలోచించే స్పేస్ ఇవ్వాలని అభిప్రాయపడింది సోనియా. వాళ్ల స్టేట్‌మెంట్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చింది ఈమె. ఒకవేళ రానా దగ్గుబాటి హోస్ట్‌గా వస్తే తాను వస్తానంటూ చెప్పింది. మొత్తానికి హోస్టుగా నాగ్ సెట్ కాలేదని చెప్పి.. చాలా పెద్ద చర్చకే తెరతీసింది సోనియా ఆకుల.