నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్ దుమ్ము రేపుతోంది. థియేటర్లలో ఈ సినిమా డామినేషన్ కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీనితో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాతో తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దుమ్ము రేపాడు. డాకు మహారాజ్ సక్సెస్ లో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. డాకు మహారాజ్ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో టాలీవుడ్ కూడా ఫుల్ జోష్లో ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలు పై టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంటుంది. ఇక బాలయ్య సినిమా అంటే ఆ హోప్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. అంచనాలను అందుకుంటూ బాలయ్య సూపర్ హిట్ కొట్టాడు. బాబి కొల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా... విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబి డియోల్ యాక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకు మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయినా టికెట్ రేట్ల విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోజుకు 5 షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్ లో 135 రూపాయలు... సింగిల్ థియేటర్స్ లో 110 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని చెప్పింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పెద్దగా తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయలేదు. ఇక ఈ సినిమాకు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు ముందు 12 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అమెరికాలో 125 లొకేషన్స్ లో మొత్తం 350 షోలు ప్రదర్శించారు. ఏపీలో టికెట్ రేట్లతో పాటుగా సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే కచ్చితంగా వసూళ్లు 300 కోట్లకు కలెక్షన్ లు పైగానే ఉండే ఛాన్స్ ఉందని నిర్మాతలు అంచనా వేసుకుంటున్నారు. అదే జరిగితే మాత్రం బాలయ్య కెరీర్లో 300 కోట్లు వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ఫాన్స్. అయితే అప్పుడే ఈ సినిమా ఓటిటీ ప్లాట్ ఫాం గురించి చర్చలు మొదలయ్యాయి. ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవ్వనుంది. దాదాపు 80 కోట్లు రూపాయలు ఖర్చు చేసి ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. కేవలం ఇది తెలుగు వెర్షన్ కు మాత్రమే. ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితే మాత్రం అది కూడా భారీ ధరకు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉండవచ్చు.[embed]https://www.youtube.com/watch?v=CphyzU_0aM8[/embed]