Project K: లుక్ తో షాక్.. ప్రభాస్ తలకి ఎవరిదో బాడీ..?
ప్రాజెక్ట్ కే లో హీరో లుక్ బాలేదంటున్నారు. ఫ్యాన్స్ వరకు ఫస్ట్ టైం ప్రభాస్ ని సూపర్ హీరో లుక్ లో చూసి ఫిదా అవుతున్నారు. కాని మిగతా ఆడియన్స్ నెటీజన్స్ మాత్రం, ఎవరో బాడీకి ప్రభాస్ తలని అతికించినట్టుంది లుక్ అంటున్నారు. నిజానికి మొన్న వచ్చిన దీపికా పదుకునే ఫస్ట్ లుక్ ని కూడా ఇలానే ట్రోల్ చేశారు.ఏదో తను సెల్ఫీ తీసి పంపిస్తే దాన్నే ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారా ఏంటి అనేశారు.

Some are criticizing that the poster of the project looks like someone's body has been pasted on Prabhas's face
అదేంటో సలార్ టీజర్ కి కూడా ఇలాంటి రియాక్షనే వచ్చింది. సలార్ టీజర్ మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చినా, ఇందులో హీరో తాలూకు విజువల్స్ బ్లర్ కాగా, దూరంగా చూపిస్తూ ఇంకా దాచేసే లా చేయటం చాలా మందికి నచ్చలేదు. సలార్ టీజర్ ని గ్లింప్స్ అంటే బెటరేమో అనేంతగా ట్రోలింగ్ జరిగింది.
నిజానికి ఆదిపురుష్ టీజర్ చూశాక, ట్రైలర్ వచ్చాక, సినిమా రిలీజై రిజల్ట్ రివర్స్ అయ్యాక ఆ ఘోరాలన్నీ చూసిన ఫ్యాన్స్ కి సలార్ టీజర్ ఊరట నిచ్చింది. అంత భయంకరమైన లోగ్రేడ్ యానిమేషన్ వర్క్ చూసిన జనానికి ఓమోస్తారు గుడ్ వర్క్ కూడా నచ్చుతుంది. సో అందుకే సలార్, ప్రాజెక్ట్ కే తాలూకు అప్ డేట్స్ నచ్చుతున్నాయనే కామెంట్ పెరిగింది. ఏదేమైన సలార్, ప్రాజెక్ట్ కే అప్ డేట్స్ ఫ్యాన్స్ కి నచ్చినా, సాధారణ నెటీజన్స్ మాత్రం క్వాలిటీ మీద కామెంట్ చేయకున్నా, సలార్ లో హీరో లుక్ ని సరిగా రివీల్ చేయలేదని, ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ ఫోటో యాంగిల్ బాలేదని కామెంట్ చేస్తున్నారు.