Young Rebel Star : కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి.. డ్యూడ్

భారీ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో, మలయాళీ హీరో పృథ్విరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 04:05 PMLast Updated on: Dec 18, 2023 | 4:05 PM

Some Have To Believe The Cutout Dude

భారీ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో, మలయాళీ హీరో పృథ్విరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు కూడా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేయబోతున్నారు. ఇంకొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్, ఒక్కో రికార్డును క్రియేట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు సలార్ కి సంబంధించిన ఒక అప్ డేట్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తూ, ప్రభాస్ సత్తాను మరోసారి గుర్తుచేస్తుంది. సలార్ మూవీ విడుదల సందర్భంగా, ముంబైలో ప్రభాస్ అభిమానుల సందడి ఆకాశాన్ని తాకింది. బాక్సాఫీస్ బాహుబలి కి గ్రాండ్ వెల్ కమ్ చెప్తూ, ఏకంగా 120 అడుగుల భారీ కటౌట్ ను, ఒక దగ్గర ఏర్పాటు చేసింది. ఈ హడావిడికి సంబంధించిన ఒక వీడియోను, చిత్ర యూనిట్ తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో విడుదల చేసింది. ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్, మరోసారి తమ రేంజ్ ఏంటో గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన ఈ కటౌట్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హల్ చల్ చేస్తుంది.