శోభిత కోసం సోనాక్షి ఫ్లాట్ కొంటున్న చైతూ, ముంబై షిఫ్ట్ అవుతున్నారా…?
టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య అక్కినేని ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర డేటింగ్ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దేవాలయాలకు తిరుగుతున్న ఈ జంట త్వరలోనే అమెరికా వెళ్ళే ప్లాన్ లో కూడా ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ జంట శోభిత ధూళిపాళ్ల, నాగచైతన్య అక్కినేని ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర డేటింగ్ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దేవాలయాలకు తిరుగుతున్న ఈ జంట త్వరలోనే అమెరికా వెళ్ళే ప్లాన్ లో కూడా ఉన్నారు. ముందు యూరప్ అనుకున్నా తర్వాత చైతూ తల్లి లక్ష్మీ… అమెరికా తీసుకు వెళ్ళాలి అనుకోవడంతో యూరప్ ట్రిప్ క్యాన్సిల్ చేసారు. ఇక ఇప్పుడు తన లైఫ్ ను ఎక్కడ కంటిన్యూ చేయాలి అనే దానిపై వర్కౌట్ చేస్తున్నారు ఈ స్టార్ జంట.
ముందు హైదరాబాద్ లోనే ఉండాలని భావించినా… శోభిత బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉండటంతో ముంబై లోనే ఉండాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనితో ముంబైలో ఒక ఫ్లాట్ కొనేందుకు నాగచైతన్య రెడీ అయ్యాడట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఒక ఫ్లాట్ ని అమ్మకానికి పెట్టగా ఆ ఫ్లాట్ ని కొనుక్కునేందుకు నాగచైతన్య ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చాడట చైతన్య. సోనాక్షి తన పెళ్లి తర్వాత ఆమె భర్త కొత్త ఇల్లు కట్టడంతో మరో ప్రాంతానికి షిఫ్ట్ అయింది.
తన ఫ్లాట్ కంటే పెద్ద ఇంటిని కట్టడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. దీనితో తాను ముందు కొనుక్కున్న ప్లాట్ ను విక్రయించేందుకు ఓ ప్రకటన కూడా చేసింది. అయితే పెళ్లికి ముందే నాగచైతన్య ఆ ఫ్లాట్ ని కొన్నట్టుగా సమాచారం. శోభిత కోసమే అక్కడ ఉండాలని… తన సినిమా షూటింగుల కోసం అప్పుడప్పుడు హైదరాబాద్ రావాలని చైతన్య భావిస్తున్నాడట. చైతన్యకు గచ్చిబౌలి సమీపంలో జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఒక ఫ్లాట్ ఉన్న సంగతి తెలిసిందే. ముందు ఇద్దరు అక్కడే ఉండాలని భావించినా శోభితకు ఇబ్బంది అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ముంబైలో ఒక ఫ్లాట్ ఉన్నా సరే సోనాక్షి సిన్హా ప్లాట్ పెద్దది కావడంతో ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేస్తున్నాడు నాగచైతన్య. స్వయంగా సోనాక్షితో నాగార్జున మాట్లాడినట్లు సమాచారం. ఇక ఆ ఫ్లాట్లో వాస్తు పరంగా కొన్ని మార్పులు కూడా చేసేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది. ప్రస్తుతం అమెరికా వెళ్లే ప్లాన్ లో ఉన్న శోభిత, నాగచైతన్య ఆ ఇంటికి ఎప్పుడు మారతారు అనేదానిపై ఇంకా స్పష్టత రావటం లేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య ఒక సినిమాలో నటిస్తున్నాడు. శోభిత రెండు సినిమాలకు సైన్ చేసింది. ఆ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఆమె రోల్ కు మంచి వెయిట్ కూడా ఉందట. ఇక ఆమెకు అటు తమిళంలో కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి.