Bigg Boss Fame: చిన్నారిని దత్తత తీసుకున్న బిగ్‌బాస్ నటి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
సానుభూతి, పేరు సంపాదించుకోవడం కోసమే.. ఆ చిన్నారిని సోనూ దత్తత తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఐతే సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు.

Bigg Boss Fame: కన్నడ బిగ్‌బాస్ సీజన్ వన్‌తో గుర్తింపు తెచ్చుకున్న సోనూ శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో.. సోనూను అదుపులోకి తీసుకున్నారు. బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని.. బైదరహళ్లిలోని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారులు ఫిర్యాదు చేశారు. సానుభూతి, పేరు సంపాదించుకోవడం కోసమే.. ఆ చిన్నారిని సోనూ దత్తత తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Devara : ‘దేవర’ వీడియో లీక్.. షాక్ లో మూవీ టీమ్
ఐతే సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. తనకు తెలిసినంత వరకు.. దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల కింద ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను.. తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసులకు ఇచ్చింది. ఐతే దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు.. సరైన పత్రాలు ఆమె దగ్గర లేవని అధికారులు అంటున్నారు.
హిందూ దత్తత చట్టం ప్రకారం, దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారిని.. ఇంటి దగ్గరే ఉంచడం నేరం. ఆపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనూను కార్నర్ చేశాయ్. ఇప్పుడు అరెస్ట్ వరకు తీసుకెళ్లాయ్.