1000 కోట్ల పోటుగాళ్లకి వెన్ను పోటు.. ప్రభాస్ దర్శకుడికి కూడా..
వందకోట్ల వసూల్లొస్తేనే దర్శక నిర్మాతలు గాల్లో తేలిపోతారు. ఇక వెయ్యికోట్ల వరదొస్తే, గాల్లో తేలిపోవటం కామన్. అచ్చంగా అలానే 1300 కోట్ల కేజీయఫ్ తో చరిత్ర స్రుస్టించాడు ప్రశాంత్ నీల్. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ తీశాడు.
వందకోట్ల వసూల్లొస్తేనే దర్శక నిర్మాతలు గాల్లో తేలిపోతారు. ఇక వెయ్యికోట్ల వరదొస్తే, గాల్లో తేలిపోవటం కామన్. అచ్చంగా అలానే 1300 కోట్ల కేజీయఫ్ తో చరిత్ర స్రుస్టించాడు ప్రశాంత్ నీల్. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ తీశాడు. 800 కోట్ల వసూల్లను రాబట్టేశాడు. ఇలా వరుసగా పాన్ ఇండియాని షేక్ చేశాడు. కాని సడన్ గా ఈ వెయ్యికోట్ల సీన్ ఉన్న కటౌట్, ఒక దగ్గర లెగ్ పెడితే, ఊహించని డిజాస్టర్ వచ్చి పడింది. అచ్చంగా ఇలానే బాలీవుడ్ కి వెయ్యికోట్ల వసూళ్లని పరిచయం చేసిన టాప్ డైరెక్టర్ కూడా బొక్కబోర్లా పడ్డాల్సి వచ్చింది. అలా తను ఓవర్ కాన్ఫిడెన్స్ కి బలయ్యాడు. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేసిన తను, 150 కోట్ల రెమ్యునరేషన్ ఎక్స్ పెక్ట్ చేసి గీతా ఆర్ట్స్ కి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు బాక్సాఫీస్ లో షాక్ కొట్టడంతో వీకైపోయాడు.. అసలు 2024 లో ఒకటి కాదు రెండు కాదు, మూడు పాన్ ఇండియా హిట్లకు కారణమైన వాళ్ళికి, విచిత్రంగా మూడంటే మూడు డిజాస్టర్లు షాక్ ఇచ్చాయి.
పాన్ ఇండియా హిట్ లతో వెయ్యికోట్లు రాబట్టిన వాళ్లు, అదే పాన్ ఇండియా ఫార్ములాకు బలయ్యారా? ప్రశాంత్ నీల్ తో పాటు మరో ముగ్గురు దర్శకుల విషయంలో ఇదే ప్రూవ్ అయినట్టుంది.
కేజీయఫ్ రెండు భాగాలు సలార్ ఫస్ట్ పార్ట్… మొత్తంగా మూడు పాన్ ఇండియా హిట్లతో రాజమౌళి తర్వాత ప్లేస్ లో కర్చీఫ్ వేసుకుని కూర్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొత్తంగా ఈ మూడు పాన్ ఇండియా మూవీలతో వెయ్యికోట్ల నెంబర్ ని తన బ్రాండ్ గా మార్చుకున్నాడు. కేజియఫ్ చాప్టర్1 కి 250 కోట్ల వసూళ్లు వస్తే చాప్టర్ 2 కి 1300 కోట్లొచ్చాయి. అంటే మొత్తంగా 1550 కోట్ల వసూల్లు కేజీయఫ్ రెండు భాగాలతో రాబట్టాడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ మూవీకి 750 నుంచి 800 కోట్లొచ్చాయి. సో మొత్తంగా మూడు పాన్ ఇండియా మూవీలతో 2300 కోట్లు రాబట్టాడు.
ప్రజెంట్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన తను, ప్రభాస్ తో సలార్ 2 ని సమ్మర్ లో మొదలు పెట్టబోతున్నాడు. అంతా బానే ఉంది. పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ఓ మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ ఉంది. కాని ఆ బ్రాండ్ ఇమేజ్ బఘీర మూవీ విషయంలో పైసాకి పనికి రాలేదు
నిజంగానే ఇది నిజం… 2024 లో పాన్ ఇండియా హిట్లు కొన్నిన ముగ్గురు దర్శకులకి, మూడు డిజాస్టర్లు కూడా వచ్చాయి. ప్రశాంత్ నీల్ సలార్ తో 2023 ఇయర్ ఎండ్ అంటే ఆల్ మోస్ట్ 2024 బిగినింగ్ ని కుదిపేశాడు. కాని తనే కథ, స్క్రిన్ ప్లే రాసిన కన్నడ మూవీ బఘీరా పాన్ ఇండియా లెవల్లో డిజాస్టర్ అని తేలింది..
తనే కాదు, హానుమాన్ తో 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ, కూడా రైటర్ గా రాసిన కథ తో డిజాస్టర్ ఫేస్ చేశాడు. దేవకీ నంద వాసుదేవ మూవీకి కథ, కథనం రాసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా డిజాస్టర్ తో షాక్ తిన్నాడు. ఇక తమిళ డైరెక్టర్ ఆట్లీ తన హిట్ మూవీని హిందీలో రీమేక్ చేసి, నిర్మాతగానే కాదు, రైటర్ గా కూడా ఫ్లాప్ ఫేస్ చేశాడు
షారుఖ్ ఖాన్ తో జవాన్ అంటూ 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన ఆట్లీ, తన హిట్ మూవీ తేరీని హిందీలో రీమేక్ చేశాడు. మరో దర్శకుడే ఈ సినిమాను తీసినా, కథ, కథనం తనదే… అలానే దర్శకత్వ పర్యవేక్షణ కూడా తనదే… అలా వచ్చిన బేబీ జాన్ వరుణ్ ధావన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని తేలింది. సో జవాన్ తో వెయ్యికోట్లు రాబ్టటిన ఆట్లీ, కేజీయఫ్, సలార్ తో వెయ్యికోట్ల వసూళ్లని రాబట్టడంలో దిట్ట అనిపించుకున్న ప్రశాంత్ నీల్, హనుమాన్ తో పాన్ ఇండియాని షేక్ చేసిన ప్రశాంత్ వర్మ, ముగ్గురుకి ముగ్గురు రైటర్లుగా డిజాస్టర్స్ ఫేస్ చేశారు.