5 గురు హీరోయిన్లతో ఎఫైర్‌ నడిపిన సౌత్‌ హీరో

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 03:35 PMLast Updated on: Mar 17, 2025 | 3:35 PM

South Hero Who Had Affairs With 5 Heroines

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్న వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. అయితే వారికి ఏమాత్రం తీసిపోని హీరో సౌత్‌లో ఉన్నాడు. ఆయనే కమల్‌ హాసన్‌. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిన కమల్ హాసన్.. తన యవ్వనంలో చాలామందితో రిలేషన్ సాగించాడనే రూమర్స్ ఉన్నాయి.

1970లోనే చాలామంది భామలతో కమల్ హాసన్ డేటింగ్ చేశాడు. కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించాడు. అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించాడు. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ చాలా సంవత్సరాలు సాగింది. కమల్ హాసన్ మొదటి భార్య వాణీ గణపతి. 1978లో వాణితో వివాహం జరిగింది. అంతా సవ్యంగా సాగుతన్న సమయంలోనే కమల్ హాసన్ జీవితంలోకి సారిక ప్రవేశించింది. దీంతో వాణి గణపతితో 1988లో విడాకులు తీసుకున్నాడు. ఆ రోజుల్లోనే పెళ్లికి ముందే పిల్లల్ని కని.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఘనత కూడా కమల్ హాసన్‌కే దక్కుతుంది. రెండో భార్య సారికతో రిలేషన్‌ మెయిన్‌టైన్ చేసిన కమల్ హాసన్.. పెళ్లికి ముందే ఆమెతో ఇద్దరు పిల్లల్ని కన్నారు. శృతి హాసన్, అక్షర హాసన్ ఇద్దరూ కమల్ , సారిక రిలేషన్‌లో ఉన్నప్పుడే పుట్టారు. ఆ తర్వాత ఈ జంట వివాహం చేసుకున్నారు. ఇదే సమయంలో హీరోయిన్ సిమ్రాన్ పేరు తెర మీదకు వచ్చింది. సిమ్రాన్, కమల్ వరుస సినిమాల్లో నటించడంతో వీరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సారిక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చేసేది లేక 2004లో కమల్‌కు విడాకులిచ్చింది రెండో భార్య సారిక. ఇక రెండో భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత నటి గౌతమితో సహజీవనం చేయడం మొదలుపెట్టారు కమల్ హాసన్.

ఈ జంట కొన్ని సినిమాల్లో కలిసి నటించింది. ఇద్దరూ దాదాపు 13 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్‌‌లో ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2017లో తమ బంధానికు గుడ్‌ బై చెప్పారు. కాగా.. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సహ నటి పూజా కుమార్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఇలా కమల్ పలువురి హీరోయిన్లతో రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అలాగే ఆయన కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హసన్ కూడా పలువురితో డేటింగ్ చేసింది. హీరో సిద్ధార్థ్, ధనుష్, నాగ చైతన్యలతో పాటు, ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో శృతి హాసన్ ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. అయితే ఇదింతా కేవలం ప్రచారాలాకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే మైఖేల్ కొసలే‌, శాంతను హజారి వంటి వారితో మాత్రం అందరికి తెలిసేలాగే సహజీవనం చేసింది. వీరిద్దరికి బ్రేకప్ చెప్పిన అమ్మడు, ప్రస్తుతం సింగిల్‌గా ఉంటోంది.