ప్రపంచాన్ని ఊపేసిన నాటు నాటు సాంగ్ ఈ పాటలో అంతటి ప్రత్యేకత ఏంటి ?

నాటు నాటు సాంగ్ స్టార్ట్ కావడానికి ముందు చెర్రీ ఓ మాట అంటాడు.. నాట్ సాల్సా, నాట్ ఫ్లెమింకో బ్రదర్ అని !

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2023 | 05:53 PMLast Updated on: Mar 12, 2023 | 5:53 PM

Specaiality Of Natu Natu Song

ప్రపంచం కూడా తర్వాత అదే మాట అనడం మొదలుపెట్టింది. నాటు నాటు సాంగ్‌కు ఫిదా అయిపోయింది. మత్తుగా సాగే సల్సా డ్యాన్స్ ఎక్కడ.. మిరపకాయ్ లాంటి మన నాటు పాటెక్కడ.. వెస్టర్న్ డ్యాన్స్ థీముల్ని కూడా పక్కకు నెట్టేసి మరీ.. ఆస్కార్ వరకు వచ్చింది నాటు సాంగ్. నాటు నాటు సాంగ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గ్లోబులో ఏ మూల చూసినా అదే పాట రీసౌండ్ ఇచ్చింది. అందుకే గోల్డెన్ గ్లోబ్ దక్కింది. మనోళ్ల వీరనాటు, ఊరనాటు పెర్ఫామెన్స్‌కి సల్సాలు, ఫ్లెమెంకోలు క్లీన్‌ బౌల్డ్ అయ్యాయ్. తెలుగు సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్లాయ్.

ఎక్స్‌ట్రా జాయ్ అండ్ ఎక్స్‌ట్రా జోష్.. నాటు పాటకు మరో ప్రత్యేకత. వాల్డ్ వైడ్‌గా వైడ్‌ దుమ్ము దులిపేస్తూ…. ఇది మన పాట అనిపించిన పాట.. నాట నాటు ! ఇంగ్లీషోళ్లను, తెలుగు నోరు తిరగని వాళ్లతో కూడా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. చంద్రబోస్ నాటు నాటు సాంగ్ రాయగా.. కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశాడు. ఈ పాటను 17రోజులు ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు షూట్ చేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మెయిన్ స్టెప్స్ 100వరకు కంపోజ్ చేయగా… చివరికి రాజమౌళి ఆ కాళ్ళ స్టెప్ ఓకే చేశాడు. అది కాస్త ప్రపంచాన్ని చుట్టేసింది. ఆస్కార్ ను ఊపేసింది.