Og : ఓజిలో ఆ మ్యాజిక్ కోసం ప్రత్యేక శ్రద్ధ..
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఈగర్ (Eagle) గా వెయిట్ చేస్తున్న చిత్రం OG. ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం (Sujeeth Directed) వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో రచ్చ రేపింది. ఇక.. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన పవన్ మాస్ స్టిల్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు.

Special care for that magic in Oji..
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఈగర్ (Eagle) గా వెయిట్ చేస్తున్న చిత్రం OG. ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం (Sujeeth Directed) వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో రచ్చ రేపింది. ఇక.. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన పవన్ మాస్ స్టిల్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు. బ్లాక్ జాకెట్, బ్లాక్ పాయింట్, కళ్ల జోడు పెట్టుకొని చేతిలో టీ గ్లాసు పట్టుకొని ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ రచ్చ రేపారు. ఇప్పటికే ఓజి టీజర్ లో పవన్ ను ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో చూపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ తర్వాత సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్న థమన్.. అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడట.. దీని కోసం ఎక్స్‌ట్రా హార్డ్‌వర్క్ చేస్తున్నాడట.
ఓజీ మూవీలో థమన్ (Thaman).. సాంగ్స్ తో పాటు బీజీఎమ్ వర్క్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట.. పవన్-థమన్ కాంబోలో వచ్చిన వకీల్ సాబ్ (Vakil Saab) భీమ్లా నాయక్(Bhimla Naik), బ్రో మూవీస్ కి థమన్ ఇచ్చిన బీజీఎం ఎంతగా ప్లస్ అయ్యిందో అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓజీ స్క్రిప్ట్ కి తగ్గట్లు థమన్ ఇస్తున్న బీజీఎమ్ ఓజి మూవీకి పెద్ద ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుజీత్ అటు పవన్ పవర్ఫుల్ క్యారెక్టర్ తో పాటు సాంగ్స్, బీజీఎమ్ విషయమై కూడా మంచి అవుట్ పుట్ రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఓజీ నుంచి మరో పవర్‌పుల్ బీజీఎమ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చకేస్తున్నారు.
కాగా.. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఓజీ మూవీని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మొదటి నుంచి ఈ చిత్రం నుంచి వస్తున్న అప్డేట్స్.. పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ ఫ్యాన్స్ ని కట్టిపడేసేలా ఉన్నాయి. సుజీత్ టేకింగ్ మరో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు అనిపిస్తోందని పవన్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్‌తో పాటు బాలీవుడ్ (Bollywood) కిస్‌ల హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తుండడం ఈ చిత్రంపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది.